మన చిన్నతనం నుండి బాలీవుడ్ సినిమా అంటే మన అందరికీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్( Amitab Bachchan ) గుర్తుకు వచ్చేవాడు.బాలీవుడ్ లో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది.
సుమారుగా నాలుగు దశాబ్దాలు తిరుగులేని నెంబర్ 1 హీరో గా రాణించిన అమితాబ్ బచ్చన్, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా కూడా అదే రేంజ్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టు గా ముందుకు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అయితే అమితాబ్ బచ్చన్ సెకండ్ ఇన్నింగ్స్ ఒక రేంజ్ లో ప్రారంభం అవ్వడానికి కారణమైన షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’.
( Kaun Banega Crorepati ) గత రెండు దశాబ్దాల నుండి దిగ్విజయం గా ఈ గేమ్ షో కొనసాగుతూనే ఉంది.ఇండియాలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ షో ని మన తెలుగు లో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ పేరుతో చిరంజీవి , నాగార్జున మరియు జూనియర్ ఎన్టీఆర్ చేసారు.
ఇక్కడ కూడా మంచి హిట్ అయ్యింది ఈ గేమ్ షో.అయితే రీసెంట్ గా జరిగిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎపిసోడ్ లో అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు( Amitab Bachchan Birthday ) సందర్భం గా ఒక ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎపిసోడ్ టీం ఒక ప్రత్యేకమైన స్పెషల్ వీడియో ని తయారు చేయించారు.ఈ వీడియో ఇండియా లో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ అమితాబ్ బచ్చన్ మీద తమకి ఉన్న అభిమానం ని చాటుకుంటూ ఎంతో గొప్పగా మాట్లాడుతారు.వారిలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా ఒకడు.
ఆయన ఎంతో ప్రేమతో అమితాబ్ గురించి మాట్లాడిన మాటలు, అమితాబ్ కి కంటతడి పెట్టేలా చేసిందట.ఈ ఎపిసోడ్ అమితాబ్ పుట్టినరోజు నాడు టెలికాస్ట్ కానుంది.ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో అమితాబ్ బచ్చన్ ఇలా లైవ్ గా కన్నీళ్లు పెట్టడం అనేది ఎప్పుడు జరగలేదు, ఇదే తొలిసారి.
ఇక అమితాబ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గానే ఆయన ప్రభాస్ తో కల్కి అనే చిత్రం చేసాడు.ఈ సినిమాతో పాటుగా రీసెంట్ గానే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం లో కూడా అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నాడు.వీటితో పాటు టైగర్ ష్రాఫ్ తో ‘గణపత్’ అనే చిత్రం, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తన్న ‘ఓజీ’ చిత్రం లో కూడా అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు టాక్.
అలా ఈ వయస్సు లో కూడా ఏడాదికి డజనుకు పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు అమితాబ్.