ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.అనంతరం స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు చింపి విసిరారు.దీంతో టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్.13 మంది సభ్యులను సస్పెండ్ చేశారు.







