ఏపీ సచివాలయంలో మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం.. రేపటి రాష్ట్ర బంద్ పై నిర్ణయం.. ?

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం పై రగులుతున్న చిచ్చు క్రమక్రమంగా రాజుకుంటుంది. ఏపీ బీజేపీ నేతల మాటలు కూడా పట్టించుకోని కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికే మొగ్గుచూపుతుందట.

 Nani's Media Conference At The Ap Secretariat  Decision On Tomorrow's State Band-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఏపీలోని అధికార పార్టీ కూడా ఈ అంశంపై ఆలోచించాలని కేంద్రానికి ఎంతలా మొరపెట్టుకున్న పెడచెవిన పెడుతూ వస్తుందట మోదీ ప్రభుత్వం.ఈ క్రమంలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్ర బంద్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని, ఆ తర్వాత బస్సులు మామూలుగానే తిరుగుతాయని చెప్పారు.రేపటి బంద్ కు సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఇకపోతే ఇప్పటికే విపక్ష టీడీపీ సహా పలు పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి.తాజాగా అధికారపక్షం వైసీపీ కూడా ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది.

మరి ఈ సెగ కేంద్రానికి తాకుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube