ముఖ్యంగా చెప్పాలంటే హిందూ మతంలో పూజ లేదా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే సమయంలో స్వస్తిక్ గుర్తు( Swastik Symbol ) వేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.స్వస్తిక్ అంటే శుభం జరగడం అని అర్థం వస్తుంది.
ఈ గుర్తు వేయడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.స్వస్తిక్ గుర్తును మొదట పూజ అందుకునే విఘ్నేశ్వరుడి గా భావిస్తారు.
అందుకే అన్ని శుభకార్యాల ప్రారంభోత్సవంలో స్వస్తిక్ ను తప్పకుండా రాస్తారు.భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశానికి చిహ్నంగా దీన్ని పరిగణిస్తారు.
ఓం( Om ) తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్ అని నిపుణులు చెబుతున్నారు.

ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది.ఇందులోని నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతు జాతులను సూచిస్తాయని ప్రజలు నమ్ముతారు.స్వస్తిక్ లోని నాలుగు దిక్కులు ధర్మం, అర్థం, కామం, మోక్షానికి చిహ్నంగా భావిస్తారు.
అలాగే ఈ గుర్తులను విష్ణువు, లక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తారు.ఈ గుర్తు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని( Positive Energy ) స్వస్తిక్ వచ్చేలా చేస్తుంది.అలాగే స్వస్తిక్ రాసేటప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
స్వస్తిక్ గీయడం వల్ల చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని ప్రజలు నమ్ముతారు.

స్వస్తిక్ నీ ఇంటి గుమ్మం మీద వేయడం వల్ల సంపద పెరుగుతుందనీ చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాగే నెగిటివిటీ తొలగిపోతుందని పెద్దవారు చెబుతున్నారు.ఇంటి ముందు చెట్టు లేదా స్తంభం ఉన్న ప్రధాన ద్వారం( Main Door ) వద్ద స్వస్తిక్ గీయడం శుభప్రదం అని చెబుతున్నారు.
ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల అదృష్టం వరిస్తుంది.ఇది శ్రేయస్సు,ప్రగతిని తీసుకుని వస్తుంది.ఇంటి బయట ఈ గుర్తు ఉంటే కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడుతుంది.దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న వ్యాధులు దూరం అవుతాయి.