డబ్ల్యూపీఎల్ 2024 ఎడిషన్( WPL 2024 Edition ) దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టే.గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ లు ఖరారు చేసుకున్నాయి.ఇక ప్లే ఆఫ్ కు చేరే మూడవ జట్టు విషయంలోనే ఉత్కంఠ నెలకొంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( Royal Challengers Bengaluru ) దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్నట్టే.నేడు బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.
ఈ పోరులో ఒకవేళ బెంగుళూరు జట్టు ఓడిన కూడా ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.
అయితే బెంగళూరు జట్టు గెలవకపోయినా స్వల్ప తేడాతో ఓడిపోతేనే బెర్త్ ఖరారు అవుతుంది.అలాకాకుండా భారీ తేడాతో అంటే 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడిపోతే యూపీ వారియర్స్( UP Warriors ) ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.గుజరాత్ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే తన చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై( Delhi Capitals ) 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించాల్సి ఉంటుంది.
నేడు బెంగుళూరు వర్సెస్ ముంబై( Bengaluru vs Mumbai ) మధ్య జరిగే మ్యాచ్ తో ప్లే ఆఫ్ కు చేరే జట్ల విషయంలో కాస్త క్లారిటీ రానుంది.
గ్రూప్ దశలో మొదటి మూడు స్థానాలలో ఉండే జట్లు ప్లే ఆఫ్ కు చేరతాయి.మార్చి 15వ తేదీ గ్రూప్ దశలో రెండు, మూడు స్థానాలలో ఉండే జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే జట్టుతో మార్చి 17వ తేదీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ప్రస్తుతానికి రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంటే, ముంబై రెండవ స్థానంలో ఉంది.