టానిక్ లిక్కర్ మాల్స్( Tonique Liquor Groups ) బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.జీఎస్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఏ మద్యం షాపుకు లేని వెసలుబాటు టానిక్ కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.గత ప్రభుత్వంలో టానిక్ కు ఏ4 ఎలైట్స్ లైసెన్స్ జారీ అయిందని తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో కేవలం టానిక్ వైన్ మార్ట్ కే ఎలైట్ అనుమతులు ఉన్నాయన్న జీఎస్టీ అధికారులు( GST Officials ) ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని చెబుతున్నారు.అయితే 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి నిర్వహిస్తున్నారని, ముగ్గురు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల పాత్ర ఇందులో ఉందని అధికారులు గుర్తించారు.కాగా టానిక్ సంస్థలతో పాటు వాటి అనుబంధ 11 క్యూ షాపుల్లోనూ జీఎస్టీ అధికారుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.