ముఖ్యంగా చెప్పాలంటే మహా శివరాత్రి ( Maha Shivratri )పండుగ మార్చి 8వ తేదీన వస్తూ ఉంది.అలాగే ఇంటిని శుభ్రం చేసి పూజ పురస్కారాలు చేస్తారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శివపార్వతుల( Shiva Parvati ) చిత్ర పటాలను ఏ దిశలో ఉంచాలో అనే విషయం గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.అలాగే ఇంట్లో దేవుడి చిత్ర పటాన్ని తమ కుటుంబ సమేతంగా ఉండే చిత్రపటాలు ఉంచడానికి ప్రత్యేక వాస్తు నియమాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.
మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్ర నియమాలను( Vastu Shastra ) పాటించడం వల్ల ఇంట్లో ప్రతికూలత తగ్గి సానుకూలత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.అందుకే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటారు.
అయితే ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా చెప్పాలంటే దేవుడి బొమ్మలను ఈశాన్యంలో ఉంచుతారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని బాత్రూం గోడ పై శివ పార్వతుల చిత్రాలే కాకుండా ఏ దేవుడి చిత్రాలను కూడా ఉంచకూడదు.
ఇది ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించేలా చేస్తుంది.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దేవత కూర్చున్న ఫోటోలను ఇంట్లో ఉంచాలి.ఈ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టడం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే పూజ మందిరంలో ఏ దేవుడి చిత్ర పఠమైనా ఉగ్ర రూపంలో ఉండకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం.ఇలా దేవుడి ముఖం ఉగ్ర రూపంలో ఉంటే ప్రతికూలతకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.