Durga Devi : శుక్రవారం నాడు ఈ దేవతలను ఆరాధిస్తే.. సంపద, ఆస్తి, ప్రేమ, అనుగ్రహం మీ సొంతం..!

శుక్రవారం( Friday ) అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది.ఈ రోజున అమ్మవారి అన్ని రూపాలను పూజించవచ్చు.

 If You Worship These Deities On Friday Wealth Property Love Grace Will Be Yours-TeluguStop.com

అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీ, దుర్గ, సంతోషిమాతను పూజించడంలోని ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు.అయితే ఈ రోజున ప్రసాదంగా తీపి వస్తువులను పంచిపెట్టడం శుభప్రదం.

పురాణాల ప్రకారం వరుసగా 16 శుక్రవారం ఉపవాసం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఈరోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

శక్తి దుర్గాదేవిని( Durga Devi ) ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు.ఇక వివిధ కారణాల వలన శుక్రవారం చాలా మంది ఉపవాసం పాటిస్తారు.

Telugu Devotees, Devotional, Friday, Goddess Lakshmi, Santoshi Mata, Saraswati D

కొంతమంది పిల్లలు పుట్టడం కోసం మరికొందరు సంతోషకరమైన జీవితం కోసం.అయితే జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడానికి శుక్రవారం నాడు ఉపవాసం చేస్తే చాలా మంచిది.దుర్గ దేవికి కూడా శుక్రవారం అంకితం చేయబడిన రోజు.ఈ రోజున దుర్గాదేవిని పూజించడం, మంత్రాలను పఠించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.శ్రీ ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రం మూడు శక్తులైన లక్ష్మీదేవి, సరస్వతి, కాళి ఆరాధన కోసం.దుర్గాదేవిని పూజించాలంటే ముందుగా దుర్గాదేవి విగ్రహాన్ని ఆవాహన చేయాలి.

ఇప్పుడు దుర్గాదేవికి స్నానం చేయించి నీళ్లతో తర్వాత పంచామృతంతో, మళ్లీ నీటితో స్నానం చేయించాలి.దుర్గాదేవికి బట్టలు సమర్పించాలి.

ఆ తర్వాత పీఠం ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆపై నగలు, దండలు అలంకరించి, తిలకం దిద్ది, ధూపం వేయాలి.దీపాన్ని వెలిగించి పూజలో ఎర్ర మందారాలు అమ్మవారికి సమర్పించాలి.

Telugu Devotees, Devotional, Friday, Goddess Lakshmi, Santoshi Mata, Saraswati D

నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించాలి.ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి.పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను సమర్పించాలి.ఇక సిరిసంపదల దేవత అయిన లక్ష్మీదేవి( Goddess Lakshmi )ని కూడా శుక్రవారం నాడు పూజిస్తారు.లక్ష్మీదేవిని తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించాలి.గులాబీ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని మాత్రమే పూజించాలి.

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన విశేష ప్రయోజనాలు లభిస్తాయి.శుక్రవారం నాడు సంతోషిమాత రూపాన్ని కూడా పూజిస్తారు.

సంతోషం, అదృష్టం కోసం సంతోషిమాతను 16 శుక్రవారాలు ఉపవాసం చేసి పూజించాలి.ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు, సంతోషాలు మీకు సొంతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube