ఇటీవల కాలంలో ఖరీదైన కార్లలో నాన్ వెజిటేరియన్ ఫుడ్స్( Non vegetarian foods ) తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.తాజాగా మరొక వీడియో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది.
జాక్ కార్డెన్ ( Jack Corden )అనే యువకుడు డ్రైవింగ్ చేస్తూ తన కారులో బీఫ్ వెల్లింగ్టన్( Beef Wellington ) అనే ఫ్యాన్సీ డిష్ వండడాన్ని వీడియో తీశాడు.వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
అందులో, జాక్ కొన్ని కూరగాయలను కోసి, ఉడికించి, గొడ్డు మాంసంలో ఉప్పు, మిరియాలు వేసి, పిండితో కప్పి, వేడిగా ఉండే మెషీన్‌లో ఉంచాడు.ఒక చేత్తో ఇదంతా చేస్తాడు, మరో చేత్తో కారు నడిపాడు.
మెషీన్ కు సీటు బెల్టు పెట్టుకుని జోక్ కూడా చేస్తాడు.డ్రైవింగ్ పూర్తి కాగానే గొడ్డు మాంసం కోసి బాగా ఉడికినట్లు చూపించాడు.
ఓ అందమైన ప్రదేశంలో కారు ఆపి తన ఆహారం తిన్నాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయింది.దానిని అప్‌లోడ్ చేసినప్పటి నుంచి రెండు లక్షల పైగా లైకులు, 40 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.జాక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 200,000 మందికి పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
అయితే అతని వంట వీడియో చాలా మందికి నచ్చలేదు.చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నాడని, రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని కొందరు విమర్శించారు.
అలా నడపడం వల్ల తనకు లేదా ఇతరులకు హాని కలుగుతుందని హెచ్చరించారు.
కారులో గొడ్డు మాంసం వండుతూ యాక్సిడెంట్ చేశామని చెబితే ఎవరైనా సరే చాలా కోపంగా వ్యక్తం చేస్తారు అని కొందరు పేర్కొన్నారు.ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదని మరో వ్యక్తి అన్నారు.ఈ వీడియోలను చూసి ఇతరులు కూడా ఇలానే చేస్తారని, చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు పోతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియోను కొందరు సీరియస్‌గా తీసుకోలేదు.దానిపై వారు జోకులు వేశారు.ఈ ఫోటో టేస్టీగా ఉంటుందేమో అని ఇంకొందరు కామెంట్లు చేశారు.