Kumbhakarna : కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడో తెలుసా? దీని వెనుకున్న కథ ఏమిటంటే..!

కుంభకర్ణుడి( Kumbhakarna ) పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నిద్ర, భోజనం.రామాయణంలో కూడా ఈ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది.

 Do You Know Why Kumbhakarna Sleeps For Six Months The Story Behind This Is-TeluguStop.com

రామాయణం ప్రకారం కుంభకర్ణుడు రావణుడి తమ్ముడు.అలాగే విభీషణుడు, సూర్పనకు అన్నయ్య కూడా.

అతను విశ్రవఋషి, కైకసి( Visravarishi, Kaikasi ) రాక్షసుల కుమారుడు.కుంభకర్ణుడు అనే పేరు అర్థం ఎక్కువ నిద్రపోయేవాడు కాదు, వాస్తవానికి దాని అర్థం కుంభ అంటే కాడ, కర్ణుడు అంటే చెవి.

చిన్నతనం నుండి అతనికి పెద్ద చెవులు ఉన్నందువలన కుంభకర్ణా అని పేరు పెట్టారు.ఇక పురాణాల ప్రకారం కుంభకర్ణుడు బాల్యం నుండి చాలా బలవంతుడు.

అంతేకాకుండా అతను చాలా ఆహారం కూడా తినేవాడు.

Telugu Bakthi, Kaikasi, Kumbhakarnas, Lord Brahma, Sleeps, Surpana, Vibhishana,

నగరం మొత్తానికి వండిన ఆహారం అతనికి సరిపోకుండా ఉండేది.ఇక కుంభకర్ణుడు తండ్రి విశ్రవసుడు తన ముగ్గురు కుమారులు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులను తపస్సు చేయమని కోరాడు.అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు.

అప్పుడు వెంటనే కుంభకర్ణుడు తనకు ఇంద్రాసనం కావాలని కోరికకు బదులుగా మాట పొలమారి నిద్రాసనం అనే మాట అతని నోటి నుండి వచ్చేసింది.దీంతో బ్రహ్మదేవుడు( Lord Brahma ) అతని కోరికలు నిర్వహించడానికి తధాస్తు అని చెప్పేశారు.

ఇక కుంభకర్ణుడు మాట తిరగబడటంతో పశ్చాత్తాపపడి బ్రహ్మ దేవుని అభ్యర్థించడం ప్రారంభించాడు.

Telugu Bakthi, Kaikasi, Kumbhakarnas, Lord Brahma, Sleeps, Surpana, Vibhishana,

అప్పుడు బ్రహ్మదేవుడు ఆ కాలాన్ని కేవలం ఆరు నెలలకు మాత్రమే తగ్గించగలిగారు.అతను ఆరు నెలలు నిద్రపోతాడు.ఒకరోజు మాత్రమే మెలకువగా ఉంటాడు.

ఆ తర్వాత అతను తిరిగి మళ్లీ నిద్రపోతాడు.కుంభకర్ణుడు నిద్రపోయే సమయంలో ఎవరైనా బలవంతంగా లేపడానికి ప్రయత్నిస్తే మాత్రం అది కుంభకర్ణుడి జీవితంలో చివరి రోజు అని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది.

ఇక యుద్ధంలో రావణుడు శ్రీ రాముడి చేతిలో ఓడిపోవడం ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ మాటలు నిజమయ్యాయి.అప్పుడు రావణుడు, కుంభకర్ణుడిని బలవంతంగా నిద్రలేపి సహాయం కోరాడు.

అయితే ఆ తర్వాత కుంభకర్ణుడు అదే రోజు ఆ యుద్ధంలో మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube