2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్( CM Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకమైన సర్వేలు చేయించుకుని.ప్రజా వ్యతిరేకత మరియు కేడర్ తో సఖ్యత లేని నాయకులను పక్కన పెట్టేస్తున్నారు.
ఏమాత్రం మొహమాటానికి పోకుండా ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పోటీ నుండి తప్పిస్తున్నారు.
ఈ రకంగా ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసి 50కి పైగా నియోజకవర్గాలలో ఇన్చార్జిల( Constituency Incharges ) మార్పు.స్థానచలనం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఇదే సమయంలో జిల్లాల వారీగా నాయకులతో కూడా సమావేశాలు కావటానికి జగన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా ఈ నెల 30వ తారీఖున ఏలూరులో( Eluru ) ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఆళ్ళనాని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని స్పష్టం చేశారు.కావున ఎన్నికల సన్నాహక సమావేశానికి సంబంధించి కార్యకర్తలతో అధ్యక్షులు భేటీ అయి సలహాలు సూచనలు ఇస్తారని పేర్కొన్నారు.కావున సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆళ్లనాని( Alla Nani ) తెలియజేశారు.
ఏలూరులోని వైసీపీ కార్యాలయంలో ఉమ్మడి ప.గో.జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో ఉమ్మడి గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిధున్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల కోసం నిర్దేశించిన కార్యాచరణను గురించి ఆళ్లనాని వివరించారు.