సోమవారం ఎన్నో సంవత్సరాల హిందువుల కల అయినటువంటి అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిన సంఘటన మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖ సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు.
అదేవిధంగా చాలామంది సినీ తారలు అయోధ్య చేరుకొని బాల రాముడు దర్శనం చేసుకున్నారు.ఇలా అయోధ్యకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇందులో భాగంగా ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన ఆది పురుష్( Aadi purush ) డైరెక్టర్ ఓం రౌత్ ( Om Rauth ) కూడా అయోధ్యకు వెళ్లారు.
ఈ క్రమంలోనే ఆయన అయోధ్య రామ మందిరం ముందు దిగినటువంటి ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ ను హీరోగా పెట్టి పూర్తిగా ఈ సినిమాని డామేజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.
అంతేకాకుండా రామాయణాన్ని పూర్తిగా మార్చేశారు అంటూ పలువురు ఈ సినిమా పట్ల విమర్శలు కురిపించారు.
ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈయన కనపడితే కొట్టే అంత కోపంలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.ఇక తాజాగా ఈయన అయోధ్యలో కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటో పై ఏంటన్న ఆది పురుష్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మీరు ఇలా అందరి ముందు బయట తిరుగుతున్నారు అంటే పెద్ద సాహసమే చేశారని చెప్పాలి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేయగా మరి కొందరైతే ఏకంగా కాస్త చూసుకొని బయట తిరగండి ఎక్కడైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు అంటూ ఈయన ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.ఈ విధంగా ఓం రౌత్ పై ఇలాంటి కామెంట్లు చేస్తున్నటువంటి తరుణంలో ఈయన పట్ల ప్రభాస్ అభిమానులు ఎంత కోపంగా ఉన్నారో స్పష్టంగా అర్థం అవుతుంది.