వాట్సాప్ లో టెక్స్ట్ ఫార్మాటింగ్ ఫీచర్లను ఎలా ఉపయోగించుకోవాలంటే..?

వాట్సప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.టెక్స్ట్ ఫార్మాటింగ్ కు సంబంధించిన ఫీచర్లు వాట్సాప్ లో ( Whatsapp ) చాలా తక్కువ.

 Whatsapp Now Offers Different Ways To Style Your Text Details, Whatsapp , Style-TeluguStop.com

అయితే తాజాగా వాట్సప్ బీటా వెర్షన్ లో టెక్స్ట్ కు( Text ) సంబంధించిన కొన్ని సరికొత్త ఫీచర్లు కనిపించాయి.ఆ ఫీచర్లు ఏమిటో అవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం.

వాట్సప్ ద్వారా టెక్స్ట్ లను ఎక్కువగా పంపాలంటే.

టెక్స్ట్ ను హైలెట్ చేయడం, ఇటాలిక్, బోల్డ్, లిస్టింగ్, కోట్ చేయడం లాంటి ఫీచర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అయితే వాట్సప్ లో కోడ్ బ్లాక్స్( Code Blocks ) అనే ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.వాట్సప్ లో కోడింగ్ టెక్స్ట్ ను పంపేందుకు ఈ కోడ్ బ్లాక్స్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ కోడ్ బ్లాక్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే టెక్స్ట్ ను కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.డెవలపర్లు వాట్సప్ ద్వారా కోడ్స్ ను షేర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చక్కగా పనిచేస్తుంది.వాట్సాప్ లో రానున్న మరో సరికొత్త ఫీచర్ కోట్ బ్లాక్స్ ఎలా పని చేస్తుందంటే.వాట్సప్ కు వచ్చిన టెక్స్ట్ మెసేజ్ లో( Text Message ) కొంత భాగాన్ని కట్ చేస్తూ రిప్లై ఇవ్వాలనుకుంటే ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఏ టెక్స్ట్ మెసేజ్ కు రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ కు ముందు గ్రేటర్ దెన్ (>) సింబల్ పెడితే ఆ టెక్స్ట్ హైలెట్ గా కనిపిస్తుంది.ఇక వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ కూడా రానుంది అది ఏమిటంటే.టెక్స్ట్ ను లిస్ట్ లేదా బుల్లెట్ పాయింట్స్ రూపంలో పంపించవచ్చు.టెక్స్ట్ లోని ప్రతి లైన్ కు ముందు ‘-‘ లేదా ‘*’ సింబల్స్ పెడితే టెక్స్ట్ లిస్ట్ రూపంలో కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube