సాధారణంగా చెప్పాలంటే కొంతమందిలో ఎప్పుడూ ఏదో ఒక భయం, ఆందోళన ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారేటప్పుడు కొత్త ఇల్లు ఎలాగ ఉంటుంది అనే ఆందోళన చాలామందిలో ఉంటుంది.
అలాగే కొంతమందిలో ఈరోజు సంతోషంగా ఉంటే రేపు ఎలా గడుస్తుందో అని భయపడేవారు ఎంతోమంది ఉన్నారు.అయితే ఇలాంటి భయాలు, ఆందోళనలు తాత్కాలికమే అని నిపుణులు చెబుతున్నారు మనం ఎప్పుడూ రేపు ఏమవుతుందో అని కాకుండా రేపు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అనే ఆలోచనతో జీవితాన్ని గడపాలి.
అంతే కాకుండా లేనిపోని ఊహలతో, ఆలోచనలతో కూడా భయాలు( Fears ) కలుగుతూ ఉంటాయి.ఇంట్లో అయినా, బయట అయినా భయానికి కారణం చీకటి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.వెంటిలేషన్ లేని ఇళ్లలో ఇలాంటి భయాలు సహజంగా ఉంటాయి.అయితే వెంటిలేషన్ లేని ఇళ్లలో మీరు అస్సలు ఉండకూడదు.ఎందుకంటే చీకటి ఉంటే ఇంటికి, మీ మానసిక ఆరోగ్యానికి( Health ) అస్సలు మంచిది కాదనీ వాస్తు నిపుణులు చెబుతున్నారు.కాబట్టి అవకాశం ఉంటే అదనపు వెలుతురు కోసం మీ ఇంటికి కిటికీల సంఖ్యను పెంచుకోవాలి.
అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి దూరంగా ఉంచాలి.అలాగే మూసిన వెంటిలేటర్స్ ( Ventilators )ను తెరిచి ఉంచాలి.చుట్టూ కాళీ లేని గృహంలో వెలుతురు అస్సలు ఉండదు.అలాగే తూర్పు, ఉత్తరం దిశ వైపు మూతపడ్డ ఇంట్లో కూడా భయాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి కొన్ని మార్పులు చేసుకోవడం వలన మీలో ఉన్న భయాలు, ఆందోళనలు దూరమవుతాయి.అప్పటికి కూడా ఈ భయాలు, ఆందోళనలు దూరం కాకుంటే వేరే ఇంటిని అద్దెకు తీసుకొని వెళ్లి అక్కడ సంతోషంగా ఉండవచ్చు.
ఈ విధంగా భయాందోళనలను దూరం చేసుకోవచ్చు.