5 జీ ట్రయల్స్: వాటికి అనుమతి నిరాకరణ.... భారత్ నిర్ణయంపై అమెరికా ఎంపీల ప్రశంసలు

భారత్‌లో 5 జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ పలు సంస్థలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించింది.

 Us Lawmakers Applaud Indias Decision To Not Allow Chinese Firms To Conduct 5g Tr-TeluguStop.com

అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని ఇందుకోసం వాడకూడదని టెలికాం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్‌ చేస్తున్నాయి.

అయితే 5జీ ట్రయల్స్ నిర్వహణకు చైనాకు చెందిన టెలికామ్ కంపెనీలను, ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన టెక్నాలజీని అనుమతించరాదన్న భారత్ నిర్ణయాన్ని అమెరికన్ ఎంపీలు ప్రశంసించారు.ఇండియాలో 5 జీ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి కోరుతూ హువాయ్, జెడ్ టీ వంటి చైనీస్ దిగ్గజాలు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వీటిని మినహాయించాలని ఇండియా నిర్ణయించింది.

ఇది భారత్‌కే కాక, మొత్తం ప్రపంచానికి కూడా మంచి వార్త అని హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ లీడ్ రిపబ్లికన్ మైఖేల్ మెక్ కాల్ వ్యాఖ్యానించారు.గతంలో ట్రంప్ ప్రభుత్వం కూడా చైనా టెక్నాలజీలు జాతీయ భద్రతకు ముప్పు అని గుర్తించిన విషయాన్ని మెక్ కాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్ లో ఉన్న టెక్నాలజీల వైపు మొగ్గు చూపవద్దని తమ దేశం ఎప్పటి నుంచో మిత్ర దేశాలను కోరుతోందని ఆయన వెల్లడించారు.భారత్ తమ సూచనను గౌరవించడంతో పాటు తనకు తానుగా ప్రమాదాన్ని గ్రహించిందని మెక్ కాల్ కొనియాడారు.

మరో ఎంపీ మైక్ వాల్ట్ ఈ నిర్ణయం పట్ల ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.

చైనా విధానాలను నిరసిస్తూనే ఉంటుందని మైక్ వాల్డ్ పేర్కొన్నారు.తనతో పాటు పలువురు సహచర ఎంపీలు కూడా తన వాదనతో ఏకీభవిస్తున్నారని ఆయన తెలిపారు.

Telugu Trials, Mhz Band, Dot, Ericsson, Michael Mccall, Nokia, Samsung-Telugu NR

మరోవైపు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా భారత్‌లో 5 జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.మనదేశంలో 5 జీ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు 16 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా.13 కంపెనీలకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.ఇక ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం 5 జీ ట్రయల్స్‌‌కు అనుమతి దక్కించుకోవడం విశేషం.5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube