రాజమౌళికి కొత్త తలనొప్పి.. అసలేం జరిగిందంటే..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.గతంలో రెండుసార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్లను మార్చిన రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ కచ్చితంగా విడుదలయ్యే విధంగా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

 Rrr Overseas Issue Troubling The Director Ss Rajamouli , Rrr, Overseas Issue, Ra-TeluguStop.com

అయితే రాజమౌళికి మరో కొత్త తలనొప్పి మొదలైందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఓవర్సీస్ హక్కుల విషయంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థకు, హక్కులు కొన్న ఒక బయ్యర్ కు నెలకొన్న మనస్పర్ధల వల్ల సమస్య మొదలైందని సమాచారం.

కరోనా విజృంభణకు ముందు హక్కులు తీసుకున్న బయ్యర్ ఒకరు తనకు ఆర్ఆర్ఆర్ హక్కులు వద్దని అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరుతున్నట్టు అందుకు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అంగీకరించనట్టు తెలుస్తోంది.

Telugu Advance, Dvv Danayya, Rajamouli, Ram Charan, Rrr Climax, Tarak-Movie

అయితే ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా రాజమౌళికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులకు సంబంధించి వస్తున్న నెగిటివ్ వార్తలు రాజమౌళికి తలనొప్పి అనే చెప్పాలి.రాజమౌళి, డీవీవీ దానయ్య ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారేమో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.1920 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఏప్రిల్ చివరి వారం నాటికి ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.అటు ఎన్టీఆర్ ఇటు చరణ్ సినీ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా నటన పరంగా, కలెక్షన్ల పరంగా బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఏడాది మే నెల నుంచి రామ్ చరణ్, తారక్ కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనుండగా రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube