60 ఏళ్లు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు( Knee Pain ) ఇబ్బంది పెట్టడం అనేది సర్వసాధారణం.కానీ ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.
అనారోగ్యమైన జీవన శైలి, పోషకల కొరత, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు.ఏదేమైనా మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.అయితే పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా మాత్రమే నొప్పిని దూరం ఇస్తాయి.
కానీ, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్స్ ను డైట్ లో చేర్చుకుంటే మాత్రం శాశ్వతంగా మోకాళ్ళ నొప్పులు మాయం అవుతాయి.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పసుపు టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా నివారిస్తాయి.
పైగా అల్లం పసుపు టీ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.వెయిట్ లాస్ కు సైతం హెల్ప్ చేస్తుంది.
అలాగే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ఆరెంజ్ జ్యూస్ ( Orange Juice )ను తీసుకునేందుకు ప్రయత్నించండి.ఎందుకంటే ఇందులో కాలుష్యం, విటమిన్ డి తో సహా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.అవి ఎముకలను బలోపేతం చేస్తాయి.మోకాళ్ళ నొప్పులను తరిమికొడతాయి.బనానా స్పినాచ్ ఆల్మండ్ స్మూతీ కూడా బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది./br>
అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటిపండు, రెండు లేదా మూడు పాలకూర ఆకులు, ఒక గ్లాసు హోం మేడ్ బాదం పాలు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా బ్లెండ్ చేస్తే స్మూతీ సిద్దమవుతుంది.రోజుకు ఒకసారి కనుక ఈ స్మూతీ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు.ఎముకల్లో సాంద్రత పెంచే సత్తువ ఈ స్మూతీకి ఉంది.
డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా, హెల్తీ గా మారుతాయి.