వికారాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్, మంచినీటి సమస్య పరిష్కరించామని కేటీఆర్ తెలిపారు.24 గంటల కరెంట్ పై అనుమానం ఉంటే రేవంత్ రెడ్డి తీగలను పట్టుకోవాలని చెప్పారు.ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారన్న కేటీఆర్ ఒక్కటి కాదు పదకొండు ఛాన్స్ లు ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని మండిపడ్డారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి వికారాబాద్ కు నీళ్లు తీసుకొస్తామని చెప్పారు.వికారాబాద్ కు మెడికల్, డిగ్రీ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.రూ.400కే సిలిండర్ ఇస్తామన్న కేటీఆర్ పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు.