ఎలాంటి లాభం లేకపోయినా కొందరు ఇతరుల వస్తువులను పాడు చేస్తుంటారు.ఇలాంటి వారిని చూస్తే ఎంత కఠినంగా శిక్షించినా తక్కువే.
తాజాగా ఈ నెల ప్రారంభంలో బెంగళూరులో( Bangalore ) జరిగిన ఓ షాకింగ్ రోడ్ రేజ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.కారు డాష్‌క్యామ్ లో ఈ సంఘటన క్యాప్చర్ అయింది.
వీడియోలో ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వెళ్లడం కనిపించింది, వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు.సారక్కి సిగ్నల్ వద్ద ఒక కారు వద్దకు రాగానే వారిలో ఒక వ్యక్తి కారు రియర్‌వ్యూ అద్దాన్ని( Car Rearview Mirror ) బలంగా గుద్ది , దానిని పగలగొట్టాడు.
తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం చెందకుండా వేగంగా వెళ్లిపోయారు.
నవంబర్ 8న @3rdEyeDude అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెల్లడించే కొన్ని చిత్రాలను కూడా షేర్ చేశారు.స్కూటర్‌లో 41 ఉల్లంఘనలు ఉన్నాయని, రూ.19,500 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని కర్ణాటక వన్ వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకున్నాడు.కేఎస్‌లేఅవుట్ ట్రాఫిక్ పోలీసులకు( KSLayout Traffic Police ) ట్యాగ్ చేసి ఈ ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసులు వేగంగా స్పందించి స్కూటర్ జయనగర్‌లోని ఒక మహిళకు చెందినదని, ఆమె కుమారుడు రోహిత్ (21) దానిని ఉపయోగించాడని తెలుసుకున్నారు.అద్దం పగులగొట్టిన తన స్నేహితుడికి రోహిత్ స్కూటర్ ( Scooter ) ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.పోలీసులు స్కూటర్‌ను సీజ్ చేసి, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, రోడ్ రేజ్ వంటి నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.అలాగే రూ.21,500 జరిమానా చెల్లించాలని యాజమాన్యాన్ని కోరారు.
పోలీసులు కారు యజమానిని సంప్రదించగా, ఆకతాయి ఉద్దేశపూర్వకంగా అద్దం పగలగొట్టాడని తనకు తెలియదని చెప్పాడు.అదొక యాక్సిడెంట్ అని లైట్ తీసుకున్నాడు.ఈ వీడియో చూసి తాను షాక్, ఆగ్రహానికి గురయ్యానని, నిందితులను శిక్షించాలని కోరారు.
అతడి ఫిర్యాదును తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.