వీడియో: ఇవి నిజంగా పురుగులేనా.. ఆకులు లాగానే ఉన్నాయే.. చూస్తే మతిపోతుంది..

ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన కీటకాలు ఉంటాయి.వాటిలో లీఫ్ ఇన్‌సెక్ట్స్‌( Leaf Insects ) చాలా ప్రత్యేకమైనవి.

 Incredible Camouflage Of Leaf Insects Video Viral Details, Viral Video, Latest N-TeluguStop.com

ఇవి మారువేషం వేసుకొని అన్ని జీవులను ఈజీగా మోసం చేస్తాయి వాటిని చూస్తే అవి ఆకులను అని ఎవరైనా అనుకోక తప్పదు.అవి కీటకాలు అని కాసేపు పట్టుకుని నిమిరితే తప్ప తెలియదు.

లేదంటే అవి కదులుతుంటే జీవమున్న కీటకాలని అర్థమవుతుంది.వారి శరీరాలు సిరలు, ఆకృతి, అప్పుడప్పుడు ఆకుమచ్చలతో అది పూర్తిగా ఆకు లాగా మారిపోతాయి.

పరిసరాల్లో ఇవి కలిసిపోయి ఇతర జీవుల నుంచి రక్షణ పొందుతాయి.

ఆకు కీటకాలు ( Insects ) ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల వర్షారణ్యాలలో కనిపిస్తాయి.ఇవి ఆకుల్లాగా ఎలా మారిపోతాయో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రముఖ ట్విట్టర్ పేజీ సైన్స్ గర్ల్ షేర్ చేసిన వీడియోలో మీరు లీఫ్ ఇన్‌సెక్ట్స్‌ ను ఒక మనిషి చేతి మీద కదులుతూ ఉండటం చూడవచ్చు.

అవి గోల్డెన్ కలర్, గ్రీన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్స్‌లో చాలా సహజమైన ఆకుల వలె కనిపించాయి.

ఇంత అద్భుతంగా అవి ఆకుల లాగా మారిపోవడానికి చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.నెటిజన్లు నేచర్ చాలా ఇన్క్రెడిబుల్ అని కామెంట్ చేస్తున్నారు కొందరు కట్టెల రూపంలో తమ అవతారాన్ని మార్చుకున్న కీటకాల వీడియోలను షేర్ చేస్తున్నారు.ఇంకా ఈ వీడియో కింద ఎన్నో నేచర్ వండర్స్( Nature Wonders ) వీడియో క్లిప్పుల రూపంలో షేర్ చేశారు.ఇక ఆకులా లాంటి కీటకాలను చూపించే వీడియో కి 34 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.60,000 దాకా లైక్ లు వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube