ఈ నెలలో తెలంగాణ ప్రాంతం లో జరగబొయ్యే అసెంబ్లీ ఎన్నికలను( Telangana Elections ) రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం.ఈ ఎన్నికలలు ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన రాజకీయ పార్టీలు మొత్తం దూరంగా ఉన్నాయి, ఒక్క పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ తప్ప.
తెలంగాణ ప్రాంతం లో ఉన్న జనసేన పార్టీ( Janasena ) క్యాడర్ ఈ ఎన్నికలలో కచ్చితంగా పోటీ చెయ్యాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చెయ్యడం తో 32 రెండు స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం అని అనుకున్నారు.కానీ బీజేపీ పార్టీ( BJP ) కలగచేసుకొని ఉమ్మడి పోటీ చేద్దామని రిక్వెస్ట్ చెయ్యడం తో పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించి పోటీ చేసేందుకు సిద్ధపడ్డాడు.
ముందుగా 11 స్థానాల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత కొన్ని లెక్కలు తప్పడం తో 8 స్థానాల్లో మాత్రమే పోటీ చెయ్యడానికి సిద్ధపడ్డారు.అందులో కూకట్ పల్లి నియోజకవర్గం కూడా ఉంది.
ఈ ప్రాంతం నుండి జనసేన పార్టీ తరుపున ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్( Mummareddy Prem Kumar ) పోటీ చెయ్యబోతున్నాడు.కాస్త బలమైన ఫోకస్ పెడితే ఈ ప్రాంతం లో జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇక్కడ అత్యధిక శాతం కమ్మ కులానికి చెందిన వారు ఉంటారు.ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్( Bandi Ramesh ) రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.
అతను సపోర్టు చేస్తే కచ్చితంగా ఈ ప్రాంతం లో జనసేన పార్టీ గెలుస్తుంది.కానీ బండి రమేష్ కాంగ్రెస్ లో చేరిపోయాడు.మళ్లీ వెనక్కి వచ్చే అవకాశమే లేదు, కాబట్టి కమ్మ ఓట్లు జనసేన కి పడాలంటే కచ్చితంగా టీడీపీ బహిరంగంగా సపోర్టు చెయ్యాలి.ఇలాంటి ముఖ్యమైన సమయం లో టీడీపీ సపోర్టు చెయ్యకపోతే ఆంధ్ర లో జనసేన ఓటర్లు టీడీపీ పై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.
ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడం ఖాయం.తెలంగాణాలో టీడీపీ ఎలా మాయం ఐపోయిందో, ఆంధ్ర లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది.
మరి తెలంగాణ ఎన్నికలలో జనసేన కి మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.నిన్న ప్రధాన మంత్రి బీసీ మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.తెలుగుదేశం పార్టీ కి సపోర్టు గా నిలిచే సోషల్ మీడియా వెబ్ సైట్లు పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వెయ్యడం ప్రారంభించింది.ఇదే దోరణితో వ్యవహరిస్తే ఆంధ్ర లో ఉండే జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానుల ఓట్లు టీడీపీ – జనసేన కూటమి కి పడే అవకాశాలు ఉండవు.
టీడీపీ పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత ని చూపిస్తారు.మరి అలా జరగకుండా ఉండాలంటే టీడీపీ జనసేన కి తెలంగాణ లో మద్దతు ఇవ్వడం అనేది తప్పని సరి.చూడాలి మరి ఇస్తుందో లేదో అనేది.