భారత సంతతికి చెందిన యూకే హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్ ( UK Home Secretary Suella Braverman )శరణార్ధులు, వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై కొన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తుండగా.
మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.తాజాగా బ్రిటన్‌కు చెందిన కొందరు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు వీధుల్లో టెంట్లు వేసుకుని నివసించడాన్ని జీవనశైలి ఎంపికగా అభివర్ణించిన వ్యాఖ్యలతో సుయెల్లా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
బ్రిటీష్( British ) ప్రజలు కరుణామయులని.నిజమైన నిరాశ్రయులకు తాము ఎల్లప్పుడూ అండగానే వుంటామని హోంమంత్రి వెల్లడించారు.కానీ మన వీధులను ఆక్రమించేలా గుడారాల వరుసలను తాము ఎన్నటికీ అనుమతించేది లేదని సుయెల్లా స్పష్టం చేశారు.వీరిలో చాలా మంది విదేశాలకు చెందినవారేనని.
జీవనశైలి ఎంపికగా వీధుల్లో నివసిస్తున్నారని బ్రిటన్ హోంమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, లాజ్ ఏంజిల్స్‌ల( San Francisco, Los Angeles, USA ) మాదిరిగా యూకే నగరాలను కానివ్వబోమని .వీధులను గుడారాలతో ఆక్రమించే రఫ్ స్లీపర్‌లపై కఠిన చర్యలకు ఆమె ప్లాన్ చేస్తున్నారు.
వీధుల వెంబడి, కాలిబాటలపై నిరాశ్రయులైన వారు నివసించడం కారణంగా ఆ రెండు అమెరికన్ నగరాల్లో నేరాల రేటు ఎక్కువగా వుందని సుయెల్లా పేర్కొన్నారు.బహిరంగ ప్రదేశాల్లో గుడారాలు వేయడం, దూకుడుగా యాచించడం, దొంగిలించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి చర్యలను తాను ఆపాలనుకుంటున్నానని సుయెల్లా తేల్చిచెప్పారు.
దీనిని తాము ఇప్పుడే అరికట్టని పక్షంలో బ్రిటీష్ నగరాలు.శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ మాదిరిగా మారిపోతాయని బ్రేవర్‌మాన్ హెచ్చరించారు.అయితే హోంమంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ప్రధాని రిషి సునాక్ ( Prime Minister Rishi Sunak )కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.మా వీధుల్లో ఎవరూ నిద్రపోకూడనే తాను కోరుకుంటున్నానని.
అందుకే నిరాశ్రయుల సమస్యను పరిష్కరించడానికి రాబోయే కొన్నేళ్లలో 2 బిలియన్ పౌండ్లు పెట్టుబడి పెట్టబోతున్నామని రిషిని ఉటంకిస్తూ ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది.
.