హెల్త్ కేర్ వర్కర్స్ కొరత.. ఆ గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోండి : బిల్లు ప్రవేశపెట్టిన యూఎస్ సేనేటర్లు

అమెరికాలో హెల్త్ కేర్ రంగం గణనీయమైన శ్రామిక శక్తి కొరతను ఎదుర్కొంటున్నందున .గ్రీన్‌కార్డులపై( Green Cards ) వున్న కంట్రీ క్యాప్ కోటాను దశలవారీగా తొలగించాలని యూఎస్ సెనేటర్లు( US Senators ) కోరారు.

 Legislation In Us Congress To Phase Out Country Quota For Green Cards Capture Un-TeluguStop.com

అలాగే వైద్యులు, నర్సుల వార్షిక గ్రీన్‌ కార్డ్ కోటా నుంచి ఉపయోగించని వీసాలను స్వాధీనం చేసుకోవడానికి ఒక చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు సెనేటర్లు ప్రకటించారు.సెనేటర్ కెవిన్ క్రామెర్, డిక్ డర్బిన్ నేతృత్వంలో ‘‘ హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ రెసిలెన్స్ యాక్ట్ ’’( Healthcare Workforce Resilience Act ) ప్రవేశపెట్టారు.

హెల్త్ కేర్ వర్క్‌ఫోర్స్ కొరతను పరిష్కరించడానికి అర్హత కలిగిన వలస వైద్యులు , నర్సులకు పరిమిత సంఖ్యలో గ్రీన్‌కార్డులను అందుబాటులో వుంచడం ఈ చట్టం ముఖ్యోద్దేశం.ఈ బిల్లు ఇప్పటికే కాంగ్రెస్‌ ద్వారా ఆమోదం పొందిన గ్రీన్‌కార్డులను రీక్యాప్చర్ చేయడానికి అనుమతిస్తుంది.

కానీ అవి మునుపటి సంవత్సరాల్లో ఉపయోగించబడనవి.నర్సుల కోసం 25,000.

వైద్యుల కోసం 15000 ఇమ్మిగ్రెంట్ వీసాలను కేటాయించింది .అయితే ఈ బిల్లు కొత్త వీసాలకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు.

Telugu Doctors, Eagle, Care Workce, Nurses, Visas, Congress, Greencards, Senator

సెనేటర్ క్రామెర్,( Senator Cramer ) జాన్ హికెన్‌లూపర్‌లు( John Hickenlooper ) లీగల్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ప్రవేశపెట్టిన .గ్రీన్‌కార్డులకు సమానమైన యాక్సెస్ (EAGLE) చట్టం ద్వారా అమెరికన్ యజమానులు .వలసదారులను వారి జన్మస్థలం కాకుండా , ప్రతిభ ఆధారంగా నియమించుకోవడంపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.అంతేకాదు.

ఈ చట్టం ఉపాధి ఆధారిత వలస వీసాలపై ప్రతి దేశంపై అమెరికా విధించిన ఏడు శాతం పరిమితిని తొలగిస్తుంది.అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలపై దేశానికి ఏడు శాతంగా వున్న పరిమితిని 15 శాతానికి పెంచుతుంది.

చాలా మంది ఉపాధి ఆధారిత వలసదారులు ప్రస్తుతం తాత్కాలిక వీసాలపై యూఎస్‌లో నివసిస్తున్నారు.వీరంతా వీసా కోసం నిరీక్షిస్తున్నారని మీడియా ప్రకటన నివేదించింది.

Telugu Doctors, Eagle, Care Workce, Nurses, Visas, Congress, Greencards, Senator

EAGLE చట్టం.సుదీర్ఘంగా వేచి వున్న వారికి బ్యాక్‌లాగ్‌ను సులభతరం చేస్తుందని సెనేటర్ క్రామెర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.ఈ బిల్లు వ్యవస్థను మరింత మెరిట్ ఆధారితంగా చేస్తుంది.ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కేటాయింపును తొలుత వచ్చిన వారికి తొలుత అనే నిబంధనగా మారుస్తుంది .అయితే గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షించని దేశాలకు చెందిన విదేశీ పౌరులపై దీని వల్ల అస్సలు భారం పడదని ఇమ్మిగ్రేషన్ వాయిస్‌కు చెందిన అమన్ కపూర్ అన్నారు.బిల్లుకు నాయకత్వం వహించి, కాంగ్రెస్‌లో వేగంగా ఆమోదించాలని కోరినందుకు సెనేటర్ క్రామెర్, సెనేటర్ హికెన్‌లూపర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చట్టం నార్త్ డకోటా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్( Health Care Workforce ) కొరతను పరిష్కరిస్తుంది.అధిక శిక్షణ పొందిన అంతర్జాతీయ నర్సులు, వైద్యులను నియమించుకోవడానికి ఈ చట్టం వెసులుబాటు కలిగిస్తుంది.

నార్త్ డకోటాకు వలస వెళ్లడానికి అదనంగా నర్సులను అనుమతిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube