మేనకోడలు పెళ్లికి నిరాకరించడంతో గొంతు కోసి హత్య చేసిన మేనమామ..!

ప్రస్తుత కాలంలో మనుషులు చేస్తున్న సులువైన పని ఏదంటే.కాస్త కూడా కనికరం లేకుండా దారుణ హత్యలు చేయడమే.

 Uncle Killed His Niece After She Refused To Marry Him In Tamilnadu Details, Uncl-TeluguStop.com

గత కొంతకాలంగా ప్రతి విషయాన్ని హత్యలని పరిష్కారంగా ఎంచుకుంటున్నారు కొందరు మూర్ఖులు.ఏవైనా మనస్పర్ధలు ఉంటే ఒంటరిగా జీవించాలి తప్ప మరొకరి ప్రాణాన్ని అనవసరంగా గాలిలో కలిపేయడం ఎంతవరకు న్యాయం.

ఈ కోవలోనే తన మేనకోడలు( Niece ) పెళ్లికి నిరాకరించడంతో అత్యంత దారుణంగా ప్రత్యక్ష చేసిన ఘటన తమిళనాడులో( Tamilnadu ) చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తిరుపత్తూరు జిల్లాలోని నాట్రంపల్లి కి చెందిన జీవిత( Jeevitha ) అనే యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.అయితే అక్టోబర్ 14న జీవిత మేనమామ చరణ్ రాజ్( Charan Raj ) వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయగా బాధితురాలు అంగీకారం తెలుపకపోవడంతో దారుణ హత్యకు పాల్పడ్డాడు.బాధితురాలు ఇంట్లోనే ఆమెను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

ఆ తరువాత అక్కడినుండి పారిపోయి పోటీ దుకాణంలో ఆశ్రయం పొందినట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఆదివారం పోలీసులు చరణ్ రాజ్ ను పట్టుకున్నారు.

అయితే నిందితుడు చరణ్ రాజ్ విషం తీసుకున్నాడని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.అంతే కాదు ఈ చరణ్ రాజ్ పై గతంలో కూడా నేర చరిత్ర ఉందని, అందుకే చరణ్ రాజ్ తో వివాహం( Marriage ) జీవిత తల్లికి కూడా ఇష్టం లేదు.కానీ చరణ్ రాజ్ ఏదో ఒకటి చేసి తన మేనకోడలైన జీవితను చేసుకోవాలి అనుకున్నాడు.ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యపడకపోవడంతో చివరికి దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube