దాల్చిన చెక్కను( Cinnamon ) ఆహార పదార్థాల రుచిని పెంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.ఎందుకంటే ఇందులో అనేక హెల్త్, బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి.
పాక శాస్త్రంలో ఇది ఒక పవర్ఫుల్ రెమిడీ అని నిపుణులు చెబుతున్నారు.స్వీట్స్ ఇతర రకాల ఆహారాల్లో దీన్ని ఉపయోగిస్తారు.
ఆహారాలలో అద్భుతమైన రుచిని అందించే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.దాల్చిన చెక్కలో( Cinnamon ) మెడిసినల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా దీన్ని పాలలో కలుపుకొని తీసుకుంటే పొందే ఫలితాలు ఎన్నో ఉన్నాయి.యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉన్న దాల్చిన చెక్కను యాంటీ బ్యాక్టీరియల్ ( Anti bacterial )గుణాలు ఉన్న పాలలో కలిపి తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) కొన్ని సంవత్సరాలుగా నిపుణులు స్టడీ చేస్తూ ఉన్నారు.ఇది డయాబెటిస్( Diabetes ) నీ అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా ఎంతో సులభం.ఒక గ్లాస్ వేడిపాలకు పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే దాల్చిన చెక్క పాలు( MILK ) తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికడుతుంది.అలాగే జీర్ణ క్రియ సజావుగా జరిగేలా చేస్తుంది.
అలాగే కంటి నిండా నిద్రపోవాలని( sleep ) భావించేవారు దాల్చిన చెక్క పాలు తాగితే సులభంగా నిద్ర పడుతుంది.కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు.దాల్చిన చెక్కపాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి ఎంతో మంచిది.
అందమైన కురులు,మెరిసే చర్మం పొందాలనుకునే వాళ్ళు రెగ్యులర్ గా ఈ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.వయసు పెరిగిన వాళ్ళలో ఎముకలు బలంగా ఉండడానికి ఈ పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ( Joint pains )ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.