హంగ్ వస్తే.. అధికారం ఎవరిది ?

తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ అంచనాలు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయి.గెలుపోటములను అంచనా వేస్తూ ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చాయి.

అయితే ఎన్ని సర్వేలు వచ్చిన అధికారంలోకి వచ్చే పార్టీ విషయంలో కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.ఎందుకంటే కొన్ని సర్వేలు అధికార బి‌ఆర్‌ఎస్( BRS ) కు అనుకూలంగా వెలువడుతుంటే మరికొన్ని సర్వేలు కాంగ్రెస్( Congress party ) కు ఫేవర్ గా కనిపిస్తున్నాయి.

ఇలా ఏ పార్టీకి స్పస్తమైన అధికారాన్ని కట్టబెట్టడం లేదు సర్వే సంస్థలు.విశ్లేషకులు సైతం స్పష్టమైన అధికారాన్ని అంచనా వేయలేక పోతున్నారు.

Telugu Cm Kcr, Congress, Kishan Reddy, Revanth Reddy, Telangana, Ts-Politics

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల తీర్పు ఈసారి భిన్నంగా ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అందులో భాగంగానే హంగ్ రావచ్చనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి.ప్రస్తుతం రేస్ లో ఉన్న ప్రధాన పార్టీలైన బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి లు బద్ద శతృత్వం కలిగిన పార్టీలుగా కత్తులు దూసుకుంటున్నాయి.

బి‌ఆర్‌ఎస్ బిజెపి మద్య అంతర్గత పొత్తు ఉందని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ మద్యనే పొత్తు కొనసాగుతోందని బి‌ఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

Telugu Cm Kcr, Congress, Kishan Reddy, Revanth Reddy, Telangana, Ts-Politics

ఇక బీజేపీ( BJP ) నేతలెమో కాంగ్రెస్ బి‌ఆర్‌ఎస్ కు దోస్తీ అని చెబుతున్నారు.ఇలా మూడు పార్టీలు త్రిముఖంగా వేలెత్తి చూపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయిన ఆశ్చర్యం లేదు.ఈ నేపథ్యంలో అధికారం కోసం బి‌ఆర్‌ఎస్ బీజేపీ జట్టు కట్టిన ఆశ్చర్యం లేదనేది బీజేపీ నేతలు చేస్తున్నవిమర్శ.

అటు కాంగ్రెస్ కూడా ఇదే తరలోనే వ్యాఖ్యానిస్తోంది.దీంతో హంగ్ ఏర్పడితే గందరగోళ పరిస్థితులు ఏర్పడడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube