ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఒకవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయ్యి, 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు .
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )ఢిల్లీకి వెళ్లారు.లోకేష్ పై ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కామ్ కేసులు ఉండడం తో అరెస్ట్ చేస్తారని భయంతోనే లోకేష్ ఢిల్లీలో ఉన్నారని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, లోకేష్ మంత్రం స్పందించడం లేదు.
ఢిల్లీ( Delhi ) నుంచి పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులకు అందుబాటులో ఉంటున్నారు .లోకేష్ సెప్టెంబర్ 14న ఢిల్లీకి వెళ్లారు.అప్పటినుంచి కొంతమంది జాతీయ నాయకులతో సమావేశం అవుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో( Chandrababu ) ములాకత్ అయ్యారు.
ఇక ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు .నేషనల్ మీడియా డిబేట్ లోనూ పాల్గొన్నారు.అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ కు ఇటీవల సిఐడి నోటీసులు జారీ చేసింది.ఈనెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు సూచించింది.ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈరోజు ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్తున్నారు.ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 8:30 కు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు .
అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం( Rajamahendravaram ) వెళ్ళనున్నారు.శుక్రవారం చంద్రబాబుతో లోకేష్ మూలాఖత్ కానున్నారు. ఈరోజు విజయవాడలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం చంద్రబాబుతో భేటీ పై క్లారిటీ రానుంది .చంద్రబాబుకు బెయిల్ రాకపోతే ఆయనతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే లోకేష్ ములాఖత్ కానున్నారు.ఇక ఆ తర్వాత పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నారు.
దీంతో పాటు జనసేన, టిడిపి కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన లోకేష్ సమీక్షించనున్నట్టు టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.