జ్యోతిష్య శాస్త్రంలో సూర్య మరియు చంద్ర గ్రహణాలకు( solar , lunar eclipses ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.2023 వ సంవత్సరం చివరి చంద్ర మరియు సూర్య గ్రహణాలు అక్టోబర్ నెలలో జరగనున్నాయి.అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం, అక్టోబర్ 28వ తేదీన చంద్రగ్రహణం ఉంటుంది.ఒకే నెలలో వచ్చే ఈ రెండు గ్రహణాలు మొత్తం 12 రాశుల వారు జీవితాల పై ప్రభావం చూపిస్తాయి.
సూర్య, చంద్ర గ్రహణం వల్ల ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.అక్టోబర్ 14వ తేదీన రాత్రి 08:34 నిమిషములకు సూర్యగ్రహణం మొదలై అర్ధరాత్రి రెండు గంటల 25 నిమిషముల వరకు ఉంటుంది.
అలాగే అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం ఒకటి ఆరు నిమిషములకు చంద్రగ్రహణం మొదలై తెల్లవారుజామున రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మన దేశంలో చంద్రగ్రహణం కనిపించదు.కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు గ్రహణాలు మిధున రాశి ( Gemini )వారికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దీనితో పాటు ఏకాగ్రత పెరిగి వీరి కెరియర్ లో పురోగతి సాధిస్తారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా విజయం సాధిస్తారు.ఇంకా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తాడు.
అటువంటి పరిస్థితిలో సింహ రాశికి( Leo ) చెందిన వ్యక్తులు ప్రయోజనాలను పొందుతారు.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.ఈ గ్రహణాల వల్ల కుటుంబం పట్ల కొన్ని బాధ్యతలు పెరగవచ్చు.ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
దీంతో పాటు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు.ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలలో తులారాశి వారికి జీవితంలో ఆనందం పెరుగుతుంది.చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
ఇలాంటి పరిస్థితులలో సమాజంలో గౌరవం పెరుగుతుంది.అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
అందరూ మీ పనిని మెచ్చుకుంటారు.మీరు వ్యాపారంలో కూడా పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు.
కానీ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.
DEVOTIONAL