కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నారీశక్తి వందన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రేపు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది.దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ ప్రగతిలో మహిళల ప్రాధాన్యత పెంచాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఈ క్రమంలోనే నారీశక్తి వందన్ బిల్లును పార్లమెంట్ ముందుకు ప్రభుత్వం తెచ్చిందని చెప్పారు.బిల్లు ఆమోదం పొందింతే లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది.అయితే మరోవైపు విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.
కేంద్రం కావాలనే ఎన్నికల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట మోసపూరిత చర్యలకు పాల్పడుతుందని మండిపడుతోంది.