ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసం ( Sravanamasam )అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మవారి పూజ ( Goddess Puja )అని దాదాపు చాలా మందికి తెలుసు.అమ్మ వారికి శ్రావణ మాసంలో పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పెద్ద వారు చెబుతున్నారు.
ప్రతి ఇంటా కూడా శ్రావణమాసంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.అమ్మ వారిని ఆరాధిస్తే ఎన్నో చక్కటి ఫలితాలు పొందవచ్చు.
శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఈ పూలను పెట్టాలి.ఈ పూలను పెడితే కచ్చితంగా అమ్మవారు మీ కోరికలను తీరుస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎర్ర మందారాలు ( Red Hibiscus )అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం.అమ్మవారికి ఎర్ర మందార పూలను పూజలో పెట్టాలి.ఎర్ర మందారాలని శక్తి స్వరూపంగా అభివర్ణిస్తారు.కాబట్టి కచ్చితంగా అమ్మవారిని పూజించేటప్పుడు మీరు ఎర్ర మందారాలనీ ఉపయోగించాలి. బంతిపూల( marigolds )ను కూడా మీరు అలంకరణగా వాడుకోవచ్చు.తోరణాలుగా కట్టి పెడితే చాలా అందంగా ఉంటుంది.
అలాగే సరస్వతి దేవికి మోదుగ పూలు అంటే ఎంతో ఇష్టం.
అలాగే మోదుగ పూలు( Magnolia flowers ) దొరికితే పూజలో ఉపయోగించడం ఎంతో మంచిది.అలాగే అమ్మ వారిని మోదుగ పూలతో పూజిస్తే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే పారిజాతం పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు.
అలాగే విష్ణువుకి కూడా ఈ పూలు అంటే ఎంతో ఇష్టం.చాలా దేవాలయాల్లో ఇప్పుడు పూల చెట్లు ఉంటాయి.
అమ్మవారికి తామర పూలు పెడితే కూడా చాలా ఇష్టం.అమ్మవారిని పూజించేటప్పుడు తామర పువ్వులను పెట్టాలి.
తామర పువ్వులను అమ్మవారికి పెడితే మీకు శుభం కలుగుతుంది.అలాగే అనుకున్న పనులన్నీ జరుగుతాయి.
మల్లెపూలను కూడా అమ్మవారికి పెట్టవచ్చు.మల్లెపూలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.
ఈ పూలను ఉపయోగించి పూజ చేస్తే సంపద పెరిగి మీరు ధనవంతులు కావడం ఖాయం.
DEVOTIONAL