ఈ అమ్మాయికి గడ్డం మీసం ఎలా వచ్చింది అంటే

టెస్ట్టోస్టీరోన్ … ఈ హార్మోన్ పేరు ఇప్పటికి చాలాసార్లు విని ఉంటారు.పురుషులలో అతి ప్రధానమైన హార్మోన్ ఇది.

 Testosterone Therapy Helped A Transgender Grow Mustache And Beard-TeluguStop.com

చెప్పాలంటే, ఈ హార్మోన్ వలనే పురుషులలో అంగస్తంభనాలు జరుగుతాయి.వీర్యం ఉత్పత్తి అవుతుంది.

గొంతు గట్టిగా ఉంటుంది.మీసం, గడ్డం పెరుగుతాయి.

కండలు బలంగా ఉంటాయి.ఈ ఒక్క హార్మోన్ పురుషుల శారీరక ప్రవర్తన, రూపుని డిసైడ్ చేస్తుంది అన్నమాట.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఒక అమ్మాయి ఈ హార్మోన్ సహాయంతో గడ్డం మీసం పెంచేసింది.

తన పేరు జేమి రెన్స్.18 ఏళ్ల వయసులో ట్రాన్స్ జెండర్ గా మారింది.కాని అప్పటికి స్ట్రీలానే కనబడుతోంది.

మరి పురుషుడిగా మారడమే కాదు, బయటకి కూడా పురుషుడిగా కనిపించాలిగా.అందుకే సైన్స్ సహాయం తీసుకుంది.

తన శరీరంలోకి టెస్ట్టోస్టీరోన్ ఎక్కిస్తే, తనకు పురుషుడిలానే గడ్డం మీసం పెరుగుతాయని గ్రహించింది.ఆలోచన వచ్చిందే ఆలస్యం.

టెస్ట్టోస్టీరోన్ థెరపి మొదలుపెట్టింది.

ఈ థెరపిలో టెస్ట్టోస్టీరోన్ లెవెల్స్ ని బాడిలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు.

థెరపి మొదలుపెట్టిన దగ్గరినుంచి, రోజూ సేల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది జేమి.ఎప్పటికప్పుడు తన ముఖంలో జరుగుతున్న మార్పులని గమనిస్తూ ఉండేది.

ఇలా మూడు సంవత్సరాలు తన శరీరంలో జరిగిన ప్రతి చిన్న మార్పుని దగ్గరగా గమనించాడు/గమనించింది జేమి.ఇదిగో, ఇప్పుడు మూడు సంవత్సరాలు గడిచాక, తను ఒకప్పుడు అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతారా.

గడ్డం, మీసంతో పూర్తిగా అబ్బాయిలా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube