Sr NTR: 35 ఏళ్ల వ‌య‌సులో కురు వృద్ధుడిగా నటించిన ఎన్టీఆర్ 

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

 Sr Ntr Acted As Old Man In His Young Age In Bheeshma Movie-TeluguStop.com

ఆయన పోషించని పాత్ర లేదు.సినీ ఇండస్ట్రీలో అప్పట్లోనే ఆయన రికార్డులు సృష్టించారు.

ఏ పాత్ర చేసిన ఆ పాత్రలో జీవించేవారు.అద్భుతమైన నటనతో, డైలాగులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక పాత్ర మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటి.ఆ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.ఎన్టీఆర్ చేసిన పాత్రల్లో కురు వృద్ధుడి పాత్ర( Old Man Role ) అందరిని షాక్ కి గురిచేసిందని చెప్పాలి.35 ఏళ్ళ వయసులో పాత్ర అంటే హీరోగానే చేస్తారు.

Telugu Bheeshma, Chakrapani, Nandamuritaraka, Sr Ntr, Srntr, Sr Ntr Role, Tollyw

తండ్రిగా చేయడానికి కూడా కొందరు ఆలోచిస్తారు.కానీ ఎన్టీఆర్ 35 ఏళ్ళ వయస్సులో కురు వృద్ధుడి పాత్ర చేసి అదరగొట్టారు.ఎన్టీఆర్ ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రని సవాలుగా తీసుకొని అద్భుతంగా నటించేవారు.ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినీమాల్లో భీష్మ సినిమా( Bheeshma Movie ) ఒక‌టి.

ఈ సినిమా విడుదల అయినప్పుడు ఎన్టీఆర్ వయస్సు 35 సంవత్సరాలు.ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ సాదించనప్పటికీ మంచి విజయాన్ని, ఎన్టీఆర్ లో మరో కోణాన్ని చూపింది.

ఈ సినిమాకి దర్శక, నిర్మాత చక్రపాణి.( Director Chakrapani ) ఈ కథ ఎన్టీఆర్ చెప్పి ఆయనతో ఒప్పించి ఈ సినిమా తీశారు.

ఈ సినిమాలో యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ భీష్మ పాత్ర నుంచి కురువృద్ధుడు అయ్యే భీష్మ పాత్ర వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించారు.

Telugu Bheeshma, Chakrapani, Nandamuritaraka, Sr Ntr, Srntr, Sr Ntr Role, Tollyw

ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా తీసినప్పుడు చాలా మందిని ఎన్టీఆర్ ముందే అడిగారట.నన్ను వృద్దుడిగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అని అడిగితే చాలా కష్టం అని చెప్పారట.కానీ సినిమాలో ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు ఎన్టీఆర్ నటనకు( NTR Acting ) ఫిదా అయ్యారు.అన్నగారిలో కొత్త కోణాన్ని చూశామని, అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు.

ఇలా ఏ పాత్ర వచ్చినా ఎన్టీఆర్ ఆ పాత్రని సవాలుగా తీసుకొని అందరితో శభాష్ అనిపించుకునేవారు.అయినా ఒక యువకుడు వృద్ధుడి పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube