శ్రావణమాసం మొదలై శుక్రవారనికి రెండు రోజులు అవుతుంది.శ్రావణమాసం ఆగస్టు 17 మొదలయింది అంటే ఈ రోజు నుంచి నిజ శ్రావణమాసం మొదలవుతుంది.
ఇది సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది.శ్రావణమాసం( Sravanamasam ) వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది.
ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది.శ్రవణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మినీ( Sri Mahalakshmi ) పూజించాలి.అందుకే ఈ మాసం ఎన్ని శుక్రవారం వస్తున్నాయో అన్ని శుక్రవారలు అమ్మవారిని పూజించడం మంచిది.
మొదట శ్రావణ శుక్రవారం 18వ తేదీన వస్తుంది.ఉదయాన్నే నిద్ర లేచే తలస్నానం చేసి,ముగ్గులు వేసి అలంకరించుకోవాలి.ఇప్పుడు అమ్మవారి ఫోటోలను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి.అమ్మవారి విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు, నగలు వేసి అలంకరించుకోవడం మంచిది.పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారి లాగా బొట్టు, గాజులు, పసుపు పెట్టుకుని ఉండాలి.ఎప్పుడూ వేసుకునే దుస్తులు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోవాలి.
మొదటి వారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు, కుంకుమ, గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి.తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టాలి.
గజరాజుల విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర ఉంచడం మంచిది.అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి.అందుకే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) పూజలో వీటిని కూడా ఉంచడం ఎంతో మంచిది.అలాగే మీ వద్ద కామాక్షి దీపం ఉంటే పూజలో పెట్టడం మంచిది.
ఈ దీపాన్ని కూడా ప్లేటులో పెట్టి బియ్యం తమలపాకు పై అలంకరించాలి.అంతేకాకుండా ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి.
ఇది మన ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది.శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలలో ఉప్పు దీపం పెట్టడం ఎంతో మంచిది.
ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేయాలి.అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోవాలి.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాదిపొడిని పూజలో చల్లుకోవాలి.ఇప్పుడు పూజను దీపారాధన ఏక హారతితో మొదలు పెట్టాలి.
అలాగే ఏ పూజ చేసినా వినాయకుడితో పూజ మొదలు పెట్టడం మంచిది.
LATEST NEWS - TELUGU