Sanjay Dutt : షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన నటుడు సంజయ్ దత్.. తలకు కుట్లు పడినా కూడా అలా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్( Double Ismart ). ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.అప్పట్లోనే ఈ మూవీ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Sanjay Dutt Head Injury Gets Stitches During Double Ismart Shoot-TeluguStop.com

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.ఇకపోతే ఇందులో రామ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్( Shraddha Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Double Ismart, Injury, Sanjay Dutt-Movie

మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary )ని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ పాన్‌ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తుండగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌( Sanjay Dutt ) కీలక పాత్ర పోషిస్తున్నారు.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది.తాజాగా ఈ సినిమా సెట్‌లో సంజయ్ దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.

కత్తితో ఫైట్‌ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం.అతని తలకు గాయం కాగా రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపారు.

Telugu Bollywood, Double Ismart, Injury, Sanjay Dutt-Movie

అయినప్పటికీ అతను వెంటనే సెట్‌కి తిరిగి వచ్చి షూటింగ్‌ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది.ఇప్పటికే ముంబైలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.ఇక ఈ చిత్రం రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో కొనసాగుతోంది.కాగా సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రం( KGF 2 )లో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.కాగా షూటింగ్లో సంజయ్ గాయపడిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో సంజయ్ దత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube