తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ).వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇస్తుండడం, చేరికలతో హడావుడి చేస్తుండడం, క్షేత్రస్థాయి పర్యటనలతో ఆ రెండు పార్టీలు జనాలకు దగ్గరవుతూ ఉండడంతో, కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో జనాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది.దీనిలో భాగంగానే కొత్త కార్యచరణతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.” తిరగబడదాం తరిమికొడదాం ” అంటూ సరికొత్త నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి, ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే బీఆర్ఎస్* BRS party ) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.దీనిలో భాగంగానే తమ పోరాటాలకు మద్దతుగా జనాలను కూడా భాగస్వామ్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.ముఖ్యంగా కర్ణాటకలో అమలు చేసిన ఎన్నికల వ్యవహాలనే ఇక్కడా అమలు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.నిన్న జరిగిన స్క్రీనింగ్ కమిటీ బేటిలో ఈ కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు అంతా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పటికప్పుడు ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనలను పాటిస్తూ, ప్రజలకు దగ్గర అవ్వాలని నిర్ణయించుకున్నారు .నిన్న జరిగిన పీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.దీనికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( , Revanth Reddy ) భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు అనేకమంది సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇక ఎన్నికల వరకు నిత్యం జనాల్లోనే ఉంటూ , పార్టీకి జన బలం పెరిగే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.