ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సప్( WhatsApp ) ఎప్పటికప్పుడు యూజర్లకు భద్రతతో కూడిన సౌకర్యవంతమైన ఫీచర్లను అందిస్తూనే ఉంది.తాజాగా మరో కీలక అప్డేట్ యూజర్ల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది.
యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకున్న వాట్సాప్, ఇకపై అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈమెయిల్ ను తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉంది.యూజర్ల ప్రైవసీని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్న వాట్సాప్ హ్యాకర్ల బారి నుంచి యూజర్ల గోప్యతను కాపాడడం కోసమే ఈ కీలక మార్పు తీసుకు వస్తున్నట్లు వాట్సప్ తెలిపింది.
యూజర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.సెక్యూరిటీ పరంగా సైలెన్స్ అన్ నోన్ కలర్స్( Silence Unknown Colors ), చాట్ లాక్ లాంటి మార్పులు తెచ్చిన సంగతి తెలిసిందే.
వాట్సప్ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన హ్యాకర్లు ఏదో విధంగా హ్యాక్ చేస్తూనే ఉన్నారు.ఇకపై హ్యాకర్ల ఎత్తుగడలు సాగకూడదు అనే ఉద్దేశంతో వాట్సప్ సరికొత్త ఫీచర్స్ తో తమ డెవలప్మెంట్ టీమ్ ను ఎప్పటికప్పుడు సన్నదం చేస్తూనే ఉంది.
తాజాగా వాట్సాప్ లాగిన్ ఈ-మెయిల్( Login e-mail ) ను త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానుంది.ఒక యూజర్ వాట్సాప్ ను యాక్సెస్ లేదా అకౌంట్ వెరిఫై చేయాలంటే ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.ఆఫ్ లో పెట్టుకుంటే మాత్రం ఈ-మెయిల్ లేకుండానే లాగిన్ అవ్వచ్చు.ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక పూర్తిగా వాట్సప్ అకౌంట్ భద్రంగా ఉంటుందని మెటా సంస్థ తెలిపింది.
ఇటీవలే వాట్సాప్ లో తాజాగా వచ్చిన ఫీచర్ ఏంటంటే.ఇప్పటివరకు కేవలం టెక్స్ట్ రూపంలో మాత్రమే మెసేజ్లు పంపించే సౌకర్యం ఉండేది.కానీ ఇకపై 60 సెకండ్ల నిడివితో ఉండే షార్ట్ వీడియో రూపంలోనూ మెసేజ్లు పంపించే అవకాశం ఉంది.