ట్రాఫిక్ లలో AI కెమెరాలు.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే..!

ప్రస్తుత కాలంలో బైక్, కార్ లాంటి వాహనాలు లేని ఇల్లు ఉండవేమో.అందుకే రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతూ పోతుంది.

 Ai Cameras In Traffic If Traffic Rules Are Violated Thats It-TeluguStop.com

అయితే ట్రాఫిక్ నిబంధనల వల్ల చాలామంది సరైన సమయాలలో ఆఫీస్ లకు వెళ్లలేక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు.దీంతో రోడ్డు ప్రమాదాలు( Road accidents ) పెరుగుతున్నాయి.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతోంది.వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఉపయోగిస్తుంది.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం( Kerala State Govt ) ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను అమర్చింది.

Telugu Ai Cameras, Antony Raju, Kerala, Latest Telugu, Road-Technology Telugu

తాజాగా వీటి పనితీరును పరిశీలించారు.కేవలం ఒక్క నెలలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 32 లక్షల మందిని గుర్తించాయి.ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించిన వారిలో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు ఇంకా ఎందరో వీఐపీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేశారు.గత నెల జూలై 5 నుండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించడం ప్రారంభించాయి.

Telugu Ai Cameras, Antony Raju, Kerala, Latest Telugu, Road-Technology Telugu

తాజాగా తిరువనంతపురంలో రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు అధ్యక్షతన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల పని తీరుకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది.అయితే కెమెరాకు చిక్కిన ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను మాత్రం బయటకు వెల్లడించలేదు.

ట్రాఫిక్ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చాక రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు.చలాన్లు చెల్లించకపోతే వాహనాల ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయకూడదని ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

బీమా కంపెనీలతో త్వరలో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలోను అద్భుతమైన సేవలను అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube