తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన జరగనుంది.ఈ మేరకు ఈనెల 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.తొలి విడతలో రూ.894 కోట్లతో 21 స్టేషన్లలో పనులు ప్రారంభంకానున్నాయి.రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, వసతుల కల్పన, స్వచ్ఛత మరియు ఉచిత వైఫై వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.కాగా ఈ మొదటి విడతలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి, మలక్ పేట్, ఉప్పుగూడ, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మం, మధిర, జనగాం, యాదాద్రి, రామగుండం, తాండూర్, కాజీపేట జంక్షన్, భద్రాచలం రోడ్( కొత్తగూడెం), జహీరాబాద్ మియు ఆదిలాబాద్ ఉన్నాయి.
తాజా వార్తలు