ఏపీలో ఎన్నికల హడావిడి గట్టిగానే సాగుతోంది.ఎలక్షన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి ప్రధాన పార్టీల అధినేతలు ఇప్పటినుంచే రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ముఖ్యంగా సీట్ల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.కాగా టీడీపీ, ( TDP party )వైసీపీ పార్టీల సంగతి అలా ఉంచితే.
జనసేన పార్టీని ( JanaSena Party )సీట్ల సమస్య గట్టిగా వేధిస్తోంది.ఎందుకంటే వైసీపీ వ్యతిరేకత ఓటును చిలనివ్వనని చెబుతున్న పవన్ టీడీపీతో పొత్తుకు సై అంటున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగనుంది ? పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడు అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీ( YCP party ) జనసేన పై సీట్ల విషయంలో పదే పదే విమర్శలు గుప్పిస్తోంది.జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుందో చెప్పాలను ప్రేజర్ పెంచుతున్నారు వైసీపీ నేతలు.ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై పవన్ దృష్టి సారించినట్లు తెల్సుస్తోంది.
పొత్తు ప్రస్తావన లేకుండా ముందు జనసేన బలంగా నిలబడే స్థానాలను ప్రకటించి ఆ తరువాత పొత్తు కన్ఫర్మ్ అయితే మిగిలిన సీట్లను ప్రకటించాలనే ప్లాన్ లో పవన్ ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.కాగా జనసేన నుంచి పోటీ చేయబోయే తొలి అభ్యర్థిని తాజాగా ప్రకటించారు పవన్ కల్యాణ్.
( Pawan Kalyan ) తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్( Nadendla manohar ) పోటీ చేస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను గెలిపించుకోవడం ఎంతో అవసరమని పవన్ చెప్పుకొచ్చారు.
దీంతో నాదెండ్ల తెనాలి నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది.ఇక ఇప్పుడు అందరి దృష్టి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడనే దానిపైనే పడింది.గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజిక వర్గాల నుంచి పోటీ చేసి రెండు చెట్ల కూడా పవన్ ఘోర ఓటమిని చవిచూశారు.
దాంతో ఈసారి పక్కా గెలిచే నియోజిక వర్గాన్నే ఎంచుకోవాలని పవన్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భీమవరం నుంచే పోటీ చేయడానికి పవన్ ఆసక్తి చూపిస్తున్నారట.
భీమవరంలో గతంతో పోల్చితే ప్రస్తుతం పవన్ గ్రాఫ్ బాగానే పెరిగింది.దీంతో ఈసారి ఇక్కడ పవన్ గెలుపు ఖాయమని భావిస్తున్నారట.మరి దీనిపై పవన్ అధికారిక ప్రకటన ఎప్పుడిస్తారో చూడాలి.