Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ స్థాయికి……అనిఖా సురేందర్ జర్నీ.. ఏకంగా ఇప్పుడు ధనుష్ తో

అనిఖా సురేంద్రన్( Anikha Surendran )….సినీ పరిశ్రమలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో ధనుష్ సినిమాలో లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగిపోయింది.

 Anikha Surendar Journey From Child Artist To Heroine-TeluguStop.com

అసలు ఎవరు ఈ అనిఖా….ఈమె బాక్గ్రౌండ్ ఏంటి? ఇంత తక్కువ సమయంలో ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యింది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.అనిఖా కేరళలోని మంజేరా( Manjera in Kerala ) అనే ఊరిలో 2004 , నవంబర్ 28న సురేందర్ త్రిచూర్ ముత్తువర, రజిత సురేందర్ అనే దంపతులకు జన్మించింది.ఈమె తండ్రి ఒక మోడల్ కోఆర్డినేటర్.ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.2007లో కేవలం మూడేళ్ళ వయసులో “చోట బొంబాయి” అనే కన్నడ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది అనిఖా.కానీ ఈ చిత్రం క్రెడిట్స్ లో ఆమె పేరు ఉండదు.ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 2010లో విడుదలైన మలయాళీ చిత్రం “కథ తుదురున్ను”.

Telugu Anikha Surendar, Anikhasurendar, Butta Bomma, Ennai Arindal, Manjera Kera

కథ తుదురున్నుతరువాత ఆరు మలయాళీ చిత్రాలలో నటించిన అనిఖా, “ఎన్నై అరిందాల్”( Ennai Arindal ) చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగు పెట్టింది.ఈ చిత్రం “ఎంతవాడుగాని” గా తెలుగులో డబ్ చేయబడింది.ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, అజిత్, త్రిష, అనుష్క వంటి స్టార్స్ తో నటించే అవకాశం కొట్టేసింది అనిఖా.ఈ చిత్రంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూడా పాపులర్ అయింది.

తరువాత నేను రౌడీనే, విశ్వాసం, ఘోస్ట్ వంటి చిత్రాలలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయింది.

Telugu Anikha Surendar, Anikhasurendar, Butta Bomma, Ennai Arindal, Manjera Kera

అనిఖాకు మొదట హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్.ఈ ఏడాది రిలీజ్ అయిన “బుట్ట బొమ్మ” ( butta bomma )చిత్రంలో అనిఖా హీరోయిన్.ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు.

ఇది ఒక రొమాంటిక్ ఆక్షన్ థ్రిల్లర్.ఈ చిత్రం “కప్పేలా” అనే మలయాళీ చిత్రం రీమేక్.

ఈ సినిమాలో అనిఖా తన నటన తో అందర్నీ మెప్పించింది.ఈ ఏడాదే మలయాళం లో కూడా “ఓహ్ మై డార్లింగ్” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా డెబ్యూ చేసింది ఈ అమ్మాయి.

దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “కింగ్ అఫ్ కొత్త”లో కూడా ఈమె నటిస్తోందని సమాచారం.ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా ధనుష్ తో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిందనే వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం “కెప్టెన్ మిల్లర్” చిత్రం తో బిజీగా ఉన్న ధనుష్, తర్వాత తన సొంత డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడట.ఈ చిత్రంలో అనిఖా లీడ్ రోల్ చేయబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే గనక నిజం ఐతే ఈమె పంట పండినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube