ఆనంద్ దేవరకొండ,( Anand Devarakonda ) విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ”బేబీ”.ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం హీరోయిన్ బోల్డ్ రోల్ కావడంతో ఈ సినిమా కుర్రాళ్లకు మరింతగా నచ్చేసింది.ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ ( Sai Rajesh )తెరకెక్కించాడు.జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.సినిమా యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో రెండు వారాలు దాటి మూడవ వారంలోకి అడుగు పెట్టిన ఇంకా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
13 రోజులు కూడా వరుసగా మంచి కలెక్షన్స్ సాధిస్తూ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమాగా మారిపోయింది.ఈ ఎమోషనల్ లవ్ డ్రామా భారీ హిట్ అయ్యి ఇప్పటికి థియేటర్స్ లో రన్ కొనసాగిస్తు స్టాండర్డ్ కలెక్షన్స్ రాబట్టాయి.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు డైరెక్టర్ సాయి రాజేష్ ప్రేక్షకులకు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాలో సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి అనే విషయం తెలిసిందే.
మరి ఇప్పటికే సినిమాలో 6 సాంగ్స్ ఉండగా ఇప్పుడు 7వ సాంగ్ ను లాంచ్ చేయనున్నట్టు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.విజయ్ బుల్గానిస్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని సినిమా సక్సెస్ కు పెద్ద ప్లస్ గా నిలిచాయి.
ఇక 7వ సాంగ్ చందమామ అనే టైటిల్ తో ఉంటుందని ప్రముఖ సింగర్ దీపు ఈ సాంగ్ ను ఆలపించారు అని తెలిపారు.దీంతో బేబీ లవర్స్ ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.