శ్రీదేవి.( Sridevi ) అతిలోక సుందరి గా మాత్రమే కాదు.
ఆమె మంచి మనసుతో, నటిగా ఆమెకు ఉన్న అందంతో నిన్న మొన్నటి తరం యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటీమణి.ఆమె చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి అందరు ఆమె గురించి గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆమె గొప్పతనం ఏంటో యిట్టె అర్ధం చేసుకోవచ్చు .ఆమె చిన్నతనం లోనే సంపాదించడం మొదలు పెట్టింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ గా గడిపిన శ్రీదేవి తన తల్లికి కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఎంతో ఉపయోగపడింది.
ఇక హీరోయిన్ గా కెరీర్ కోసం ఆమె ఎంతో కష్టపడింది.
అప్పుడు కూడా డబ్బు సంపాదించే మెషిన్ గా మారిపోయింది.ఇక తల్లి ఆరోగ్యం విషయంలో శ్రీదేవి ఒక పోరాటమే చేసింది.ఆ తర్వాత ఆమె తల్లి చనిపోయాక చెల్లితో తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల కోసం కోర్ట్ కి ఎక్కింది.
రెండో పెళ్లి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చనిపోయే వరకు కూడా కష్టాలు పడింది.అత్త వారింట్లో సరైన స్థానం లేక, అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.
ఇక బోనీ( Boney Kapoor ) ఆమెను ఉద్ధరించింది కూడా ఏమి లేదు.సినిమాలు తీసి అప్పుల పాలైతే అతడి అప్పులు తీర్చడం కోసం ఆమె తన సర్వస్వము దారపోసింది.
చివరికి చెన్నై, హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను తెగనమ్మి అతడికి ఇచ్చింది.
ఇక శ్రీదేవి పిన్ని భర్త ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి చిన్నతనం నుంచి అందరికి బాగా సంపాదించి పెట్టిందని, కానీ ఆమెకు మాత్రం మనశాంతి దొరకలేదని, తల్లి, చెల్లి, భర్త ఆమెను బ్రతికి ఉన్నంత వరకు పీక్కు తిన్నారని, చివరికి దుబాయ్ లో( Dubai ) కూడా బోనీ తో గొడవ జరిగి, తన రూమ్ కి వెళ్ళిపోయి మందు ఎక్కువగా తీసుకొని పొరపాటున బాత్ టబ్ లో పడి ఈ లోకాన్ని విడిచి పెట్టి పోయిందని తెలిపారు.బోని కపూర్ కి సంబందించిన కుటుంబం ఎప్పుడు శ్రీదేవి కుటుంబాన్ని దగ్గరకు రానివ్వలేదని, బోనీ మాత్రం అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వచ్చే వారని తెలిపారు.అయితే పిల్లలకు కూడా తెలుగు రాదనీ, అందువల్ల తమతో కలవలేకపోతున్నారని చెప్పి బాధపడ్డారు శ్రీదేవి బాబాయ్.