రెండో దశ వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) భాగంగా పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్( CM Jagan ) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఏకవచనంతోనే సంబోధిస్తూ ఒకపక్క ప్రభుత్వ సమస్యలను మరోపక్క తనపై చేసే విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ).పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.కేవలం సీఎం జగన్ ని విమర్శించడానికి పవన్ తాడేపల్లిగూడెంకి వచ్చినట్లు పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పవన్ చెప్పిన లెక్కలు మొత్తం అవాస్తవమని అన్నారు.గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు మరియు మోసాలు పవన్ కళ్యాణ్ కి కనిపించవా అంటూ నిలదీశారు.
రాష్ట్ర ప్రజలు అభిమానించే సీఎం జగన్ నీ సంస్కారహీనుడు అని పవన్ విమర్శించడం దారుణమని అన్నారు.పవన్ మాట్లాడిన స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు.? తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన దుర్మార్గపు పనులు పవన్ కి కనిపించలేదా.? 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో.పవన్ తెలుసుకోవాలని సూచించారు.
కనీస జ్ఞానం లేకుండా డయాఫ్రం వాల్ కట్టి కొన్ని కోట్లు దోచేసారంటూ మండిపడ్డారు.గౌరవప్రదమైన సేవా దృక్పథంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు.
కేవలం సీఎం జగన్ ని విమర్శించడానికి పవన్ యాత్రలు చేస్తున్నారు.పవనే.
సంస్కారహీనుడు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ మండి పడటం జరిగింది.