మనం భోజనంలో ఉప్పును( salt ) సమపాళ్లలో వాడుతుంటాం.ఎక్కువ తక్కువ కాకుండా వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి.
సాధారణంగా ఇళ్లలో ఉప్పు లేదా సాల్ట్ ప్యాకెట్ పాతవి ఉంటే పడేస్తుంటాం.అలా కాకుండా వాటిని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు.
ముఖ్యంగా టాయిలెట్‌లో పెడితే చాలా లాభాలు ఉన్నాయి.సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే బాత్ రూమ్‌లు వాసన వస్తుంటాయి.
ఆ దుర్వాసనను పోగొట్టేందుకు డెట్టాల్, లైజాల్ వంటి వాటితో కడుగుతుంటాం.అయితే ప్రతి సారీ అలా చేయడం సాధ్యం కాదు.
పిల్లలు తరచూ బాత్ రూమ్‌కి వెళ్తుంటారు.ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుంటే దీని వల్ల దుర్వాసన పెరుగుతుంది.
ముఖ్యంగా తేమ ఉండడం వల్ల అది బ్యాక్టీరియాలు( Bacteria ) పెరగడానికి కారణం అవుతుంది.ఇన్ఫెక్షన్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది.
అయితే కేవలం మన ఇంట్లో ఉండే పాత, లేదా పాడైన ఉప్పుతో బాత్ రూమ్‌ను చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చు.
వంటింటి చిట్కాలతో ఎన్నో ప్రయోజనాలు మనకు అందుబాటులో ఉంటాయి.కిచెన్‌లో ఉండే పాత ఉప్పును లేదా సాల్ట్ ప్యాకెట్‌ను తీసుకోవాలి.ఆ ప్యాకెట్‌ను కొద్దిగా మడవాల్సి ఉంటుంది.
తర్వాత దానిని బాత్ రూమ్( Bathroom ) లోపలికి తీసుకెళ్లాలి.ఆ తర్వాత ఆ ప్యాకెట్‌ను టాయిలెట్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
దానిని టాయిలెట్‌లో హ్యాంగర్‌కి వేలాడదీయొచ్చు.టాయిలెట్ బాక్స్ మీద కానీ, దాని సమీపంలో ఉండే రాడ్ మీద కానీ పెట్టొచ్చు.
దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.సాధారణంగా బాత్ రూమ్‌లు లేదా టాయిలెట్‌లు వర్షా కాలంలో దుర్వాసన వెదజల్లుతుంటాయి.ముఖ్యంగా బాత్ రూమ్‌లో తేమ ఉండడం వల్ల ఇలా జరుగుతుంటుంది.దీనిని పోగొట్టేందుకు, ఈ సమస్యను నివారించేందుకు ఇలా ఉప్పు ప్యాకెట్‌ను టాయిలెట్‌లో ఉంచొచ్చు.అందులో కొంచెం బేకింగ్ సోడా ( Baking soda )వేస్తే ఇంకా బాగుంటుంది.తద్వారా బాత్ రూమ్ లేదా టాయిలెట్‌లో తేమను ఈ ఉప్పు ప్యాకెట్ పీల్చుకుంటుంది.
తద్వారా దుర్వాసన తగ్గి టాయిలెట్ మనం వినియోగించుకునేలా ఉంటుంది.