జులై 1న వచ్చే శని త్రయోదశి ఎందుకు ప్రత్యక్షమైనదో తెలుసా..?

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం అనురాధ నక్షత్రానికి అధిపతి శని అని పండితులు చెబుతున్నారు.అలాంటి శనికి సంబంధించిన నక్షత్రంలో శనివారం రావడం ఆ రోజు శని త్రయోదశి కావడం చేత ప్రతి సంవత్సరం వచ్చే శని త్రయోదశిలలో ( Shani )ఇది చాలా గొప్పదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 Do You Know Why Shani Triodashi Is Visible On July 1 , Astrology, Shani Triodash-TeluguStop.com

ఈ శని త్రయోదశి రోజు మకర, కుంభ, మీనరాశుల జాతకులు అలాగే కర్కాటక, వృశ్చిక రాశుల( Cancer , Scorpio ) జాతకులు శనికి తైలాభిషేకం చేయించుకొని దశరథ ప్రోక్త శని స్తోత్రములను పఠించినట్లయితే వారికి ఏలినాటి శని,అష్టమ శని వంటి దోషాలు దూరం అయిపోతాయి.

Telugu Aquarius, Astrology, Cancer, Capricorn, Lord Vishnu, Rasi Falalu, Scorpio

శని త్రయోదశి రోజు మందపల్లి, శని సింగపూర్, తిరునాల్లారు వంటి క్షేత్రాలను దర్శించడం ఎంతో మంచిది.త్రయోదశి శనివారం రోజు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా భావిస్తారు.శనివారం శ్రీమహావిష్ణువుకు( Lord Vishnu ) ఎంతో ఇష్టమైన రోజు అని పండితులు చెబుతున్నారు.

అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు.అందుకనే త్రయోదశి శనివారం రోజు వస్తే శివకేశవులకు అత్యంత ఇష్టమైన దినమని పెద్దవారు చెబుతూ ఉంటారు.

Telugu Aquarius, Astrology, Cancer, Capricorn, Lord Vishnu, Rasi Falalu, Scorpio

అలాగే శని జన్మించిన తిథి కూడా త్రయోదశి.అందుకోసమే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఉంది.ఇంకా చెప్పాలంటే శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు శనికి తైలాభిషేకం,నవగ్రహ ఆలయ దర్శనము, శివాలయ దర్శనము చేసుకోవడం ఎంతో మంచిది.ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఉన్న కర్కాటక రాశి జాతకులు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న వృశ్చిక రాశి జాతకులు ఏలినాటి శని ప్రభావం ఉన్న మకర, కుంభ, మీనరాశుల జాతకులు శనికి తైలాభిషేకం చేయడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే శని త్రయోదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈరోజున ఉపవాసం ఉండడం ఎంతో మంచిది.శని శాంతి, పూజలు ఈ శని త్రయోదశి రోజు చేయించడం వల్ల కలిగే నష్టాలు దూరం అయిపోతాయి.శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

నల్ల వస్త్రాలను ధరించడం లేదా దానం చేయడం రెండు మంచిదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube