రుక్మిణి కళ్యాణ పారాయణం ఎందుకు చేయాలో తెలుసా..?

కొంతమందికి ఎంత ప్రయత్నించిన వివాహం జరగకుండా ఉంటుంది.కొందరికి మంచి సంబంధం వచ్చి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది.

ఇంకొంతమంది ఎన్ని సంబంధాలు చూసిన సరైన మ్యాచ్ రాక బాధపడుతూ ఉంటారు.చాలామంది రాజీపడి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటి వారు రుక్మిణి కల్యాణ పారాయణం చేస్తే పెళ్లికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి.అమ్మాయైనా, అబ్బాయైనా సరే పారాయణం చేయవచ్చు.

రుక్మిణీ పారాయణం( Rukmini Parayanam ) చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Lord Krishna, Lord Shiva, Lord Vishnu,

గురువారం లేదా శుక్రవారం రోజున మాత్రమే ఇది మొదలు పెట్టాలి.ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసి అప్పుడు పెట్టాలి.జంటగా ఉండే దేవి, దేవతల ఫోటోలు మాత్రమే పూజలో ఉండేలా చూసుకోవాలి.

సీతారాములు, శ్రీకృష్ణుడు రుక్మిణి( Lord krishna ), లక్ష్మీదేవి విష్ణుమూర్తి, పార్వతి పరమేశ్వరులు ఉన్న పటాలను పూజించిన ఎంతో మంచిది.తర్వాత విష్ణుమూర్తికి( Lord vishnu ) షోడశోపచార పూజను నిర్వహించాలి.

షోడశోపచారలో పది ఉపచారాలు పూర్తి చేసిన తర్వాత రుక్మిణి కల్యాణ లేఖనం చదవడం మొదలు పెట్టాలి.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Lord Krishna, Lord Shiva, Lord Vishnu,

తర్వాత ధూపం, దీపం, నైవేద్యంగా సమర్పిస్తే పూజ పూర్తయినట్లు అవుతుంది.పాయసం, ఖర్జూరం, బెల్లం,ఆవు పాలు ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చని పండితులు చెబుతున్నారు.41 రోజులు శ్రద్ధపెట్టి లీనమై ఇలా చేస్తే తప్పకుండా కళ్యాణం అవుతుంది.అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సంకల్పం చెప్పుకొని శ్రద్ధగా పూజ చేస్తే 20 నుంచి 25 రోజుల్లో కళ్యాణ ఘడియలు వచ్చేస్తాయి.మీ కోరిక నెరవేరిన తర్వాత 8 మంది ముత్తయిదవుల ను పిలిచి అందులో పెద్ద ఆవిడ్ని రుక్మిణిగా భావించి తాంబూలం ఇచ్చిన తర్వాత రవికల గుడ్డ, వీలైతే చీర ఇచ్చి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి.

అలా చేస్తే పారాయణం పూర్తవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube