తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఎలాంటివో మనందరికీ తెలిసిందే.కొన్ని సినిమాలు అయితే ఆయన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసి మరీ విజయం సాధించాడు… కౌబాయ్ వంటి సినిమాలను టాలీవుడ్ ( Tollywood )కి పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ కి ఉంది.
అలాంటి కృష్ణ పర్సనల్ కెరియర్ లో కూడా కొన్ని విమర్శల పాలైన సంగతి తెలిసిందే.ఎందుకంటే మొదట తన మరదలు ఇందిరా దేవి( Indira Devi ) ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినీ నటి అయిన విజయనిర్మలను( Vijayanirmala ) రెండో పెళ్లి చేసుకున్నారు.
ఇక విజయనిర్మల కు కూడా ఇది రెండో పెళ్లి.
ఇక కృష్ణ ఇందిరా దేవి కి ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు జన్మించారు.
పెద్దకూతురు పద్మావతి ఆ తర్వాత రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు ,ప్రియదర్శిని.ఇందులో పెద్దకూతురు పద్మావతి( Padmavati ) పెళ్లిలో ఒక వింత సంఘటన జరిగిందట.
తన కూతురు పెళ్లికి ఏకంగా ముఖ్యమంత్రి కే ఫోన్ చేసి నా కూతురు పెళ్లికి రావద్దు అని మొహం మీద చెప్పారట కృష్ణ.మరి అలా చెప్పాల్సిన అవసరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కృష్ణ పెద్దకూతురు పద్మావతి ని జయదేవ్ గల్లా( Jayadev Galla ) అనే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి కోడలుగా పంపించారు.అయితే వీరి పెళ్లి జరిగిన టైంలో తమిళనాడు సీఎం గా జయలలిత ఉన్నారు.జయలలితకు తన కూతురు పెళ్లికి రమ్మని ఆహ్వానం పంపించారట కృష్ణ.అయితే అదే టైంలో జయలలిత( Jayalalithaa ) పెళ్లికి వద్దాం అనుకున్న టైంలో ఆమె సెక్యూరిటీ వచ్చి మొదటి మూడు వరుసల్లో కూర్చున్న విఐపి లను లేవమని చెప్పారట.

ఆ మూడు వరసల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, రాజకీయ పెద్దలు, వ్యాపారవేత్తలు కూర్చున్నారట.అయితే వీరిని కాళీ చేయించడం ఇష్టం లేని కృష్ణ ఏకంగా జయలలితకే ఫోన్ చేసి మీరు మా కూతురు పెళ్లికి రాకండి అంటూ మొహం మీదే చెప్పారట.అయితే ఈ విషయాన్ని చాలా సింపుల్ గా తీసుకున్న జయలలిత పెళ్లికి రాకుండా తన తరఫున ఒక పూల బొకేని పంపి కొత్త జంటకి కంగ్రాట్స్ చెప్పింది.అలా కృష్ణ ఏ విషయంలోనైనా సరే చాలా సింపుల్ డెసిషన్ తీసుకునే వారట.
ఇక గత కొద్దిరోజుల క్రితమే కృష్ణ తనువు చాలించిన విషయం మనకు తెలిసిందే.