ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగాసనాలు వేయడంతో పాటు వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) దంపతుల ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆయన అందుకున్నారు.
ప్రవాస భారతీయులు, అమెరికాకు చెందిన కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు.బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
మోడీ పర్యటనతో భారత్, అమెరికా సంబంధాలు మరో మెట్టుపైకెక్కాయని నిపుణులు తెలిపారు.
ఇకపోతే.
మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయన కోసం ఇండో అమెరికన్ వంటకాలను సిద్ధం చేయించారు బైడెన్.ఈ విషయంలో కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ మూలాలున్న ఆలూర్ ఆనంద్( Alur Anand ) పూజారి కీలకపాత్ర పోషించారు.
గత మూడు దశాబ్ధాలుగా వాషింగ్టన్‌లో వుంటున్న ఆయన ‘‘వుడ్ ల్యాండ్స్ ’’ ( Woodlands )రెస్టారెంట్ పేరుతో శాఖాహార వంటకాలను అమెరికాలోని భారతీయులకు రుచి చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో మోడీ అమెరికాలో వున్న మూడు రోజులూ రుచికరమైన శాకాహార వంటకాలను తయారుచేసే బాధ్యతను ఆనంద్‌కే అప్పగించింది శ్వేత సౌధం.
వైట్‌హౌస్‌లో మోడీకి ఇచ్చిన విందుకు సంబంధించిన మెనూలో నోరూరించే వంటకాలను చేర్చారు.మిల్లెట్ అండ్ గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్( Millet and Grilled Corn Kernel Salad ), వాటర్‌మెలన్ అండ్ టాంగీ అవకాడో సాస్, స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్, రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యోగర్ట్, క్రిస్ప్‌డ్ మిల్లెట్ కేక్‌లు, సమ్మర్ స్క్వాష్, గుజరాతీ స్టైల్ కిచిడీ, ధోక్లా, ఇడ్లీ చట్నీ, వడ సాంబార్ వంటి భారతీయ వంటకాలను ఆతిథులు రుచిచూశారు.భారత్ నుంచి అమెరికాకు వచ్చిన ఏ ప్రముఖుడైనా సరే ఆనంద్ చేతి రుచి చూడాల్సిందే.వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో మోడీకి ఇచ్చి విందుకు 400 మంది అతిథులను ఆహ్వానించారు.
కర్ణాటకలోని బైందూర్ తాలూకాలోని కల్లంగడి హౌస్‌కు( Kallangadi House ) చెందిన బడియా పూజారి, గిరిజ దంపతుల కుమారుడు ఆనంద్ పూజారి .ఈయన తన భార్య సుమితతో కలిసి దాదాపు 35 ఏళ్లుగా వాషింగ్టన్‌లో వుంటున్నారు.భారత్‌కు చెందిన కేంద్రమంత్రులతో పాటు ఇతర వీఐపీలకు ఆయన ఎన్నోసార్లు ఆతిథ్యం ఇచ్చారు.2023ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మోడీ విందులో మిల్లెట్లతో కూడిన సాంప్రదాయ బిసి బిల్లా బాత్‌ను కూడా ఆనంద్ తయారు చేయించారు.అలాగే మెనూలో పొందుపరిచిన వంటకాల ప్రత్యేకతలను కూడా పూజారి ఆతిథులకు వివరించారు.