గిన్నిస్ రికార్డ్ సృష్టించిన స్పెయిన్ వ్యక్తి.. హీల్స్‌తో పరిగెత్తి మరీ...

ఇటీవల చాలామంది వినూత్నంగా ఆలోచిస్తున్నారు.తమ వినూత్న పనులతో చర్చల్లో ఉంటున్నారు.

 Spanish Man Breaks 100-metre Sprint Record Wearing High Heels Details, Heels, Ma-TeluguStop.com

ఎవరికి తోచని పనులు చేస్తూ వార్తల్లో ఉండటమే కాకుండా అనేక రికార్డులు సొంతం చేసుకుంటున్నారు.తాజాగా ఒక వ్యక్తి వినూత్నమైన పని చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Record ) సృష్టించాడు.

ఇంతకు అతడు చేసిన పనేంటి? అనేది ఇప్పుడు చూద్దామా.

Telugu Metre Sprint, Robertolopez, Gunnis, Heels, Spain, Spanish, Latest-Latest

రన్నింగ్( Running ) అంటే ఎవరైనా షూస్ వేసుకుంటారు.రన్నింగ్ పోటీలలో పాల్గొనేవారు అయితే అత్యంత ధర కలిగిన రన్నింగ్ షూస్‌ను వాడుతూ ఉంటారు.ఈ షూస్ సులువుగా ఉండటమే కాకుండా పరిగెత్తడానికి కంపార్ట‌బుల్‌గా ఉంటాయి.

కానీ ఒక వ్యక్తి రన్నింగ్ షూస్ కాకుండా హైహీల్స్‌( High Heels ) వేసుకుని పరిగెత్తాడు.పరిగెత్తడమే కాకుండా ఈ వినూత్న పనితో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

హైహీల్స్ వేసుకుని నడవడం అంటేనే కష్టంగా ఉంటుంది.అలవాటు లేనివారికి తొలుత హైహీల్స్ వాడినప్పుడు నడుం, తుంటి భాగం నొప్పిగా అనిపిస్తాయి.

అలవాటు అయితేనే కానీ హైహీల్స్ వేసుకుని నడవలేరు.

Telugu Metre Sprint, Robertolopez, Gunnis, Heels, Spain, Spanish, Latest-Latest

అలాంటి హైహీల్స్ వేసుకుని ఒక వ్యక్తి 100 మీటర్ల పరుగు పందెంలో గిన్నిస్ రికార్డు సాధించాడు.స్పెయిన్‌కి చెందిన క్రిస్టియన్ రబర్టో లోపెజ్ రోడ్రిగ్వెజ్ ఈ ఘనత సాధించాడు.ఇప్పటికే అతడు 12 రికార్డులు సాధించాడు.ఈ సారి కాస్త వినూత్నంగా ఆలోచించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.100 మీటర్ల పరుగును కేవలం 12.82 సెకన్లలోనే పూర్తి చేసి విజేతగా నిలిచాడు.ఇతడి వయస్సు 34 ఏళ్లు మాత్రమే.

గతంలో కళ్లకి గంతలు కట్టుకుని పరిగెత్తడం, వెనక్కి పరిగెత్తడం, టేబుల్ టెన్నిస్ బాల్‌ను బాట్ మీద బ్యాలెన్స్ చేస్తూ పరిగెత్తడం లాంటి ఎన్నో రికార్డులు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube