అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని ( Bharatiya Janata Party )ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రతిపక్షాలు సంఘటతం కాకపోవడం వల్లే భాజపా కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిలబెట్టుకోగలుగుతుందని.వ్యక్తిగత లాభనష్టాలను పట్టించుకోకుండా దేశ శ్రేయస్సు కోసం పార్టీలు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు మహారాష్ట్ర ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్( Sharad Pawar ).
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కాకుండా కనీస ఉమ్మడి కార్యక్రమాల ద్వారా కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని అప్పుడే భాజపా వ్యూహాలను తిప్పిగొట్టగలిగినట్లు అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.ఈనెల 23న జరగబోయే ప్రతిపక్షాల సభలో తాను ఈ దిశగా ప్రతిపక్షాలను సమాయత్తం చేసే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
బాజాపా ఇప్పుడు తిరుగమన దిశలో ఉందని బలంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా భాజపాను ఢీకొట్టగలమని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు .మహారాష్ట్రలో ( Maharashtra )బారాస పార్టీ దూసుకెళ్తుంది అన్న కెసిఆర్( KCR ) వాఖ్యల పై స్పందించమన్న విలేకరుల ప్రశ్నకు భారతదేశంలో ఏ పార్టీకైనా ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేసే హక్కు ఉంటుందని ,అయితే ఆ పార్టీ భాజాపాకు బీ టీం అవునా? కాదా ? అన్నది చూడాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఆమోదయోగ్యం కాదని సంఖ్యాబలం ఉందన్న కారణంతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా వెళ్లే ఏ పార్టీ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఆయన్ని సందర్భంగా చెప్పుకొచ్చారు.
భాజాపాను రాష్ట్రాలు తిరస్కరించినందున జాతీయస్థాయిలో కూడా పరిస్థితి భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదని ప్రతిపక్ష కూటమికి కాంగ్రెసు పెద్దన్న పాత్ర పోసించి అన్నీ పక్షాలను కలుపుకుని పోవాలని , రాజకీయ ఆకాంక్షలు కోసం కాకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ప్రతిపక్షాలు కలిసిరావలని ఆయన పిలుపునిచ్చారు .జూన్ 23 న జరగబోయే ప్రతిపక్షాల సభ బాజాపా వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు వేదిక అవుతుందని తాను బావిస్తున్నానని ఆయన ఈ సందర్భం గా చెప్పుకొచ్చారు
.